మదన్‌మోహన్ మాలవ్యా - About Madan Mohan Malaviya in Telugu
ఏ మూర్తిని చూస్తే హిమాలయమే తలవంచుతుందో, ఏ గంగ తన తరంగాలతో పాదాలు కడగడానికి ముందుకు వస్తుందో, ఏ తులసి తనను మాలగా అతని మెడలో వేయండని తహతహలాడుతుందో అట్టి పావనమూర్తి, ధర్మాత్ముడు శ్రీ మదన్ మోహన్ మాలవ్యా.
మహోన్నత కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి అవి తమ జీవితకాలంలో వాటి స్వరూపాన్ని చూసే భాగ్యం కొంతమందికి ఉండకపోవచ్చు. కార్యక్రమ పునాదులనే కాదు, వాటి ఎత్తైన భవనాలను చూసేభాగ్యం కొందరికే దక్కుతుంది. అట్టివారిలో ధన్యాత్ముడు మాలవ్యా.
ధవళకాంతులీనే వస్త్రాలతో, నుదుట విభూతి తిలకంతో, స్వచ్భత, సాత్వికత, ధార్మికతలు రంగరించిన అమృతమూర్తి మాలవ్యా.
ప్రయాగలో 25. 12. 1861న సంస్కృత విద్వాంసుల ఇంట జననం. ఇతని పూర్వులు మాల్వా ప్రాంతం నుండి రావడంవల్ల వీరిని మాలవీయులని స్థానికులనేవారు. డిగ్రీ చేతబుచ్చుకొని కొంతకాలం అధ్యాపకునిగా కాలం గడిపాడు. న్యాయ పట్టాను గ్రహించి ప్రముఖ న్యాయవాది అయ్యాడు. ఆపైన అసలు జీవితం మొదలు.
న్యాయవాదవృత్తిని చేపట్టి తిమ్మిని
బమ్మిచేసి లక్షలార్జించిన వారు వేలమంది. అది కాదితని లక్ష్యం. ప్రజా
జీవితరంగంలో అడుగుబెట్టాడు. కలకత్తాలో 1886లో రెండవ కాంగ్రెసు సభలు జరుగగా
దానికి అధ్యక్షత వహించిన దాదాభాయి నౌరోజీ ఇతని కంఠంలో భారతదేశం
ప్రతిధ్వనిస్తోందని అన్నాడు.
Mother India is herself resonant in the voice of the young man
ఇక పత్రికా రచయితగా, స్థాపకునిగా
ప్రసిద్ధుడయ్యాడు. “హిందూస్తాన్” పత్రిక; ఆంగ్లంలో ‘లీడర్’ పత్రికలను
స్థాపించిన ఘనత ఇతనికే దక్కింది. ఆ లీడర్ పత్రికకు మన తెలుగువాడైన
చిజ్టావూరి యజ్జేశ్వర చింతామణి (సి.వై. చింతామణి) సంపాదకుడు.
30 సంవత్సరాలు అప్రతిహతంగా నడిపాడు. తరువాత ఢిల్లీలో “హిందూస్తాన్ అప్రతికకు సారథ్యం వహించాడు.
అల్హాబాద్‌లో ‘ప్రథమపౌరునిగా ఉన్నా (city
father) ప్రాంతీయ ప్రతినిధుల సభలో ఉత్తరప్రదేశ్ ప్రతినిధిగా ఉన్నా దేశంలో
గుర్తింపదగిన వ్యక్తిగానే భాసిల్లాడు. అగ్రపీఠమే. కాంగ్రెసు సమావేశాలలో
రెండుసార్లు అధ్యక్ష్య పదవి కలకత్తా, ఢిల్లీలలో దక్కింది. గాంధీచంద్రు
డుదయించక ముందే తిలక్, మాలవ్యా సూర్యులు జాతికి వెలుగును, వేడిని
ప్రసాదించారు. మధ్యమధ్యలో కారాగారవాసం. రెండవ రౌండ్‌టేబుల్ సమావేశానికి
స్వాతంత్యం గురించి చర్చించడానికి లండన్ వెళ్ళాడు. తనతో గంగను తీసికొని
వెళ్ళాడని అతని చరిత్ర చెబుతోంది.
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో, సెంట్రల్ అసెంబ్లీలో సెడిషన్
బిల్లుపై, ప్రెస్ లాస్‌పై ఇతడు తన వాదనాపటిమతో పాలకులను ఆకట్టుకొన్నాడు.
ఒక ప్రముఖ విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని కలలుగన్నాడు. తాను స్థాపించిన హిందూ కళాశాలను అనిబిసెంటు ఇతనికి ధారాదత్తంచేసింది. దీనిని 1916లో హిందూ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాడు. సర్ సుందర్‌లాల్, సర్ పి. ఎస్. శివస్వామి అయ్యర్, ప్రపంచ ప్రఖ్యాత డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితుడు మొదలగు దిద్దంతులు దానికి ఉపకులపతులుగా పనిచేసి ప్రసిద్ధిని పొందారు. ప్రఖ్యాతిని తీసికొనివచ్చారు. ఆ సంస్థ దినదిన ప్రవర్ధమానమౌతున్న కాలంలో ప్రజలందరూ ఇతణ్లి ధర్మాత్మునిగా కీర్తించేవారు. జీవితాంతం సహస్ర గాయత్రీజపం చేసేవాడని విన్నాను. తపస్వి.
కాశీ విశ్వవిద్యాలయానికి డబ్బులితడు సమకూర్చుకునే పద్ధతిలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎందరో సంస్థానాధీశులు దీనికి దానాలు చేసారు. ఇతనిని భిక్షు మహారాజ్ (prince among beggars) అని గాంధీగారన్నారు. ముస్లిమ్‌సంస్థ కానిదానికి విరాళమీయడానికి నిజామ్ నవాబు ఒప్పుకోలేద్దు. శుక్రవారం మసీదు దగ్గర యాచకులుంటారు కదా! తానూ ఒక యాచకునిగా నిలబడ్డాడు మాలవ్యా. ఆశ్చర్యపడి తన భవనానికి తీసికొనివెళ్ళి పెద్దమొత్తంలో నవాబ్ దానం చేశాడట. అట్లే ఒక మహారాజు పితృకార్యాలు నిర్వహిస్తూ ఉంటే దానాలు పట్టే బ్రహ్మణుణ్ణి తప్పుకోమని దానం పట్టడానికితడు సిద్ధమయ్యాడు. ఇతణ్జి చూసి వందల్లో ఇచ్చేవారు, వేలల్లో సమర్పించేవారట.
ఈ విశ్వ విద్యాలయం ధర్మం, దేశభక్తి అనే స్తంభాలపై నిలబడిన మహోన్నత భవనం. ఈ ఆవరణలోనే సిక్కుల గురుద్వారా, ఆర్య సమాజ మందిరంతోబాటు మసీదు కూడా ఉండేది. హిందూ ముస్లిం ల అల్లరిలో మసీదును కొందరు కూల్చగా, సొంత డబ్బును వెచ్చించి మసీదునితడు మరల కట్టించాడు. ఇట్లా సర్వమత సమభావం, మాటలలోకాదు చేతలలో చూపించిన మహానుభావుడు.
రామ్‌పూర్ నవాబు, ఛత్రాయి నవాబు, ఆగాభాన్‌వంటి హైందవేతరులు కూడా ఈ విద్యాసంస్థకు దానధర్మాలు చేశారంటే ఇతని మహోన్నత వ్యక్తిత్వమెట్టిదో ఆలోచించండి భూరివిరాళాలు సేకరించడం, ‘సుదీర్ధంగా ఉపన్యసించడం ఇతని ప్రవృత్తి,
ఇక సంఘ సంస్కరణ విషయంలోనూ ఇతడు ముందంజలో ఉన్నాడు. హరిజన విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతోపాటు వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. హిందూస్థాన్ స్కౌట్ సంఘాన్ని స్థాపించాడు. జాతీయోద్యమ సందర్భంగా ప్రభుత్వం ప్రతియేటా ఇచ్చే గ్రాంటును (సహాయాన్ని) నిలిపివేసింది. స్థానిక మహారాజులు ఆదుకున్నారు. మహారాణులు బంగారు ఆభరణాలను దానం చేసేవారు. అధ్యాపకులు తమ జీతాలనే తగ్గించుకున్నారు. ఈనాడు జీతాలే పరమధ్యేయంగా ఉద్యమించే నేటివారెక్కడ? వారెక్కడ? విధులను విస్మరించి హక్కులకై పోరాటం సాగించడాన్నిఅన్ని పార్టీలు బలపరుస్తున్నాయి కదా! ప్రభుత్వం నుండి అప్పు తీసికొంటే సకాలంలో చెల్లించాలని చెప్పడానికి బదులు అప్పులను ఎగనామం పెట్టండని చె నాయకులున్నకాలమిది. విధులకై హెచ్చరించే సంస్థలు, పార్టీలు నేడున్నాయా?
జాతీయభావన పేరుతో, బుజ్జగించు ధోరణితో హిందువులను పట్టించుకోని నాయకుల ధోరణి చూసి హిందూ మహాసభను ఏర్పాటు చేసాడు. అంతేకాదు, మతం మార్చుకొన్న హిందువులను తిరిగి హిందూమతంలోకి వచ్చేలా శుద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసాడు. ఇతర మతాల పట్ల ద్వేష భావంతో కాదని గుర్తించండి. నౌఖాళీలో బహుక్రూరంగా హిందువులు నరుక బడినపుడు ఆ వార్తవిని ‘క్రుంగిపోయాడు. తలనుండి పాదం వరకు అతనిలో ఉన్నది గుండెయే అని సి.వై.చింతామణి ప్రశంసించాడు. “Heart head to feat” ఇటీవల భారతరత్న బిరుదును ఇతనికి ప్రభుత్వం ప్రకటించింది.
Source - VSK Telangana
ధర్మాత్మ మదన్‌మోహన్ మాలవ్యా
ReplyDelete