Idi mana desam bharatha desam lyrics in telugu
పల్లవి :
ఇది మన దేశం.భారత దేశం వేట కుక్కలను గుంట నక్కలను
కుందేళ్లే ఉరికించిన దేశం..
జై భారత్ జై హింద్ హింద్
జై భారత్ జై హింద్ హింద్
ఇది మన దేశం..భారత దేశం..
1.అభాగ్యులందరి తోడు నీడగా
ఆకలి తీర్చే అన్నపూర్ణ రా
అంధకారమున అలమటించే
జాతి జనులకిది జ్ఞాన భూమిరా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు
అవతరించిన దైవ ప్రదేశం!!
జై భారత్ జై హింద్ హింద్
జై భారత్ జై హింద్ హింద్
ఇది మన దేశం..భారత దేశం..
2.ఉగ్రవాదుల గుండెలదరగా
జెండా మోసిన దేశ భక్తిరా
తీవ్రవాదుల దొంగదెబ్బలకు తల వంచని జాతీయ శక్తిరా
అమ్మ భారతికి అండదండగా కండలు పెంచిన వీరుల దేశం
జై భారత్ జై హింద్ హింద్
జై భారత్ జై హింద్ హింద్ ఇది మన దేశం..భారత దేశం..
3.కులభేదాలను కూలద్రోసి కుటుంబ విలువల పెంపోందించి,
ఉత్తమ పౌరులమై వికసించి,
పర్యావరణం పచ్చగ చేసి,
స్వదేశీ పథమున అడుగులు వేసి
సంకల్పించిన భారతీయులం
జై భారత్ జై హింద్ హింద్
జై భారత్ జై హింద్ హింద్
ఇది మన దేశం..భారత దేశం
No comments