కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించరా - Krishna Govinda Krishna Gopala Lyrics in Telugu
కృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించరా
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా
పనులు సాగిస్తూనే నామం జపియించర
నామం జపియిస్తునే పనులు సాగించర
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవిందా కృష్ణ గోపాల!!
కొందరంటారు కృష్ణుడు తినలేడని
కొందరంటారు కృష్ణుడు పడుకోడని కొందరంటారు కృష్ణుడు ఏమివ్వడు
కొందరంటారు శ్రీ కృష్ణుడే లేడని!!
అమ్మ ప్రేమిస్తే వెన్నను గ్రోలిందేవరు
అమ్మ లాలిస్తే ఉయ్యాలలూగిందేవరు
అమ్మ చూస్తుంటే లోకాలు చూపిందేవరు
అమ్మ నాన్నల సంకెళ్లు త్రేమ్చిందేవరు
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవింద కృష్ణ గోపాల
2. కొందరంటారు కృష్ణుడు బలహీనుడు
కొందరంటారు కృష్ణుడు మహా చోరుడు
కొందరంటారు కృష్ణుడు పిరికోడని
కొందరంటారు చేసింది ఏముందని!!
విషం పాలిచ్చే పూతనను చంపిందెవరు
దొంగిలించిన పాల్ పెరుగు పంచిందేవరు
కంస చాణుర మర్ధన చేసిందేవరు
దుష్ట కౌరవుల దుర్మార్గ మణచిందేవరు
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవింద కృష్ణ గోపాల
3. కొందరంటారు కృష్ణునికి పొగరుందని
కొందరంటారు వివక్షత కలవాడని
కొందరంటారు బంధు ప్రీతీ కలవాడని
కొందరంటారు కృష్ణునికి ఏమి తెలుసని!!
పేద స్నేహితుని పాదాలు కడిగిందేవరు
దాసి పుత్రుని ఇంట్లోన తిన్నది ఎవరు
రాజసూయాన ఎంగిలాకు లెత్తెందెవరు
ధర్మ స్థాపనకు తన వాళ్ళనొదిలిందేవరు
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవింద కృష్ణ గోపాల
4. కొందరంటారు కృష్ణుడు స్త్రీ లోలుడు
కొందరంటారు కృష్ణుడు తన మొగుడని
కొందరంటారు కృష్ణుడు ప్రియ సఖుడని
కొందరంటారు కృష్ణుడు మాయగాడని!!
చెర విడిపించి స్త్రీ విలువ పెంచిందేవరు
రాసలీలలో మోక్షాన్ని ఇచ్చిందేవరు
కుబ్జ రూపాన్ని అందంగ మార్చిందెవరు
రాధ మీరాబాయి హృదయాన నిలిచిందెవరు
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవింద కృష్ణ గోపాల
5.కొందరంటారు కృష్ణుడు రాలేడని
కొందరంటారు కృష్ణుడు రక్షించడు
కొందరంటారు కృష్ణుడు సామాన్యుడు
కొందరంటారు కృష్ణుడు అజ్ఞానని!!
కృష్ణ అనగానే చీరలు తెచ్చిందెవరు
పిలుపు వినగానే గోవుల కాచిందెవరు
విశ్వ రూపాన్ని పార్థునికి చూపిందేవరు
కృష్ణ తత్వాన్ని గీతలో చెప్పిందేవరు
కృష్ణ గోవింద గోపాల గోంతేత్తరా
కృష్ణ గోవింద కృష్ణ గోపాల
ReplyDeleteకృష్ణ గోవిందా అంటూ నువ్వు స్మరియించరా
కృష్ణ గోపాల అంటూ నువ్వు భజియించరా