బలగం కొమరయ్య తాత రాసిన పాట - Koduka Nanu Kothakammakura Song Lyrics in Telugu
పల్లవి :
కొడుకా... నను కొతాకమ్మకురా .. కన్ను మూసే దాకా కష్టపడతా నీ కోసం. || కొడుకా||
1.అవ్వతోని అర్ణమొచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన
పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్దకాపుగా నిన్ను చేసిన
ఇపుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోదనైతిని ||2||
వట్టి కాసుల కోసరము నను కొట్టి చంపే వాళ్ళ కిస్తవ. || కొడుకా||
2.అల్కబీరోల్లోస్తరంటా ఎక్కువ పైసలిస్తరంటా
పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే
కట్టి కొట్టి పడేస్తరంటా నీళ్ళు మ్యాతా వెట్టరంట ||2||
నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తిని. || కొడుకా||
3.పెయ్యి మీద సలసలా కాగేటి నీళ్ళు వొస్తరంటా
కింద వడ్డా నన్ను మిషిని మీద యాల్లాడేస్తరంటా
ప్రాణముండాగానే తోలు వలిసి ఊడా దీస్తరంటా ||2||
సగము గొంతు గోసి రగతము మందులల్ల వొస్తరంటా || కొడుకా||
4.దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండ వానల పన్లు చేసిన
యెనక జనమల కింది బాకీ ఇచ్చిపొ నీ ఇంటికొచ్చిన
ఇన్ని నాళ్లు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా ||2||
బాంచ నైత కొడుకా నన్నా అరబ్బొల్ల కమ్మవోకు || కొడుకా||
కొడుకా... నను కొతాకమ్మకురా .. కన్ను మూసే దాకా కష్టపడతా నీ కోసం
ReplyDelete