Breaking News

గ్రామ పంచాయితీలో ఎవరేం చేస్తారు?


నేను మొదట చెప్పిన విధంగా దేశ అభివృద్ధి గ్రామం నుండే మొదలవ్వాలి అని. అందులో భాగంగానే అస్సలు మన గ్రామ పంచాయితీలలో ఎవరేం చేస్తారో తెలుసుకుందాం.

క్ర.సం
గ్రామ పంచాయితీ
సర్పంచు
వార్డు సభ్యులు
కార్యదర్శి
1.
పరిపాలనా సంబంధిత అధికారాలు
పాలనా యంత్రణాధికారం
సమావేశాలలో పాల్గొని ప్రశించే/తీర్మానించే అధికారం
తీర్మానాల చట్టబద్ధత పరిశీలన/అమలు, రికార్డుల భద్రత
2.
వనరుల సమీకరణ
అవకాశాల పరిశీలన, తనిఖీ, సమీక్ష
నూతన ఆదాయ అవకాశాల ప్రతిపాదన, ఆదాయ వ్యయాల పరిశీలన
చట్టపరమైన చర్యలు
3.
గ్రామ పంచాయితీ ఆర్ధిక వ్యవహారాల నిర్వాహణ
అజమాయిషీ, తనిఖీ
కార్యకలాపాల ఆర్థిక పరిశీలన, చర్చ, ఆడిట్ నివేదికల పరిశీలన, దుబారా నివారణ
నిబంధనల మేర ఖర్చు, నమోదు
4.
త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, లైటింగ్ మొదలైన పౌర సదుపాయాల కల్పన
అజమాయిషీ, పర్యవేక్షణ, తనిఖీ
సేవల నాణ్యత పరిశీలన, మెరుగుకై సూచనలు, తీర్మానాలు
తీర్మానాలు అమలు, నిబంధనల మేరకు ఖర్చులు, నమోదు
5.
బైలాను, జాయింటు కమిటీల ఏర్పాటు
సమీక్ష
నిర్ణయించుట, పాల్గొనుట
బైలాస్ తయారీలో సభ్యులకు సహకారం అమలు, సమీక్ష
6.
అభివృద్ధి కార్యక్రమాలు
గ్రామసభ ఎంపిక చేసిన లబ్దిదారుల నివేదికపై పర్యవేక్షణ/సమీక్ష
అభ్యంతరాలను చర్చించుట, సూచించుట, పరిష్కరించుట
లబ్దిదారుల అర్హతలను సభ దృష్టికి తీసుకురావడం, అమలు, సమీక్ష


గ్రామ పంచాయితీ సమావేశాలు


గ్రామ పంచాయితీ సర్వసభ్య సభ నాలుగు రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
1.సాధారణ సమావేశం: కనీసం మూడు నెలలకు ఒకసారి
2.ప్రత్యేక సమావేశం: ఉపాధ్యక్ష ఎన్నిక కొరకు, బడ్జెట్ ఆమోదం కొరకు జరిగేవి
3.అత్యవసర సమావేశం: తక్కువ వ్యవధిలో (కనీసం 2 రోజులు) నోటిసుతో జరిగేది
4.అభ్యర్థనపై సమావేశం: మూడోవంతు సభ్యులు కోరినపుడు.


మీ గ్రామంలో కూడా ఇవ్వన్ని అమలు అయ్యేలా చుడండి. ఈ సమాచారాన్ని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగిస్తారు అని ఆశిస్తూ.

జై హింద్.
- సాయినాథ్ రెడ్డి.

7 comments:

  1. గ్రామ పంచాయితీలో ఎవరేం చేస్తారు?

    ReplyDelete
  2. గ్రామ పంచాయితీల గురించి అవగాహన కల్పించడం మంచి ప్రయత్నం.

    ReplyDelete
    Replies
    1. దీనికి మీ సహకారం కూడా జత అయితే బాగుంటది,

      Delete
  3. దీనిని ప్రతీ ఒక్కరు ప్రింట్ తీసుకుని మీ గ్రామాలలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో అతికించండి. ప్రతీ ఒక్కరు దీనిని అమలు చేయాలి.

    ReplyDelete
    Replies
    1. కచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తే మంచి ఫలితాలను చూస్తాం.

      Delete
  4. Assalu maa gramamlo samaveshaale jaragavu.

    ReplyDelete
  5. me sarpanch ni kalavandi.

    ReplyDelete