Breaking News

భౌతిక,ఆధ్యాత్మిక పద్దతులను ప్రపంచానికి అందించిన పురాతన దేశం

అప్పు చేసైనా సరే పప్పు కూడు తినాలని చెప్పాడు చార్వాకుడు.500 సంవత్సరాల క్రితం పుట్టిన అమెరికా ఇప్పుడు ఎలాగైతే ప్రపంచంలోని అన్ని దేశాలకంటే ఎక్కువ అప్పు చేసి భౌతిక సుఖాలు అనుభవిస్తుందో,అంతకంటే ముందుగానే వేలసంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన చార్వాకుడు ఇదే విషయాన్ని చెప్పాడు.విలాసాల వినియోగవాదాన్ని,దుబారా జీవితాల గురించి భారత దేశానికి తెలియక కాదు.దాని విష పరిణామాలు ఎలా వుంటాయొ తెలిసిన మన పెద్దలు ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మన ముందు వుంచి,సుఖాలను అందించారు.అందుకే భౌతిక,ఆధ్యాత్మిక పద్దతులను ప్రపంచానికి అందించిన పురాతన దేశం మన దేశమని ' అంటారు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీజీ.

పది గంటలు సుఖం,పదింబావు గంటలు దుఖం ,మళ్ళీ పదిన్నర గంటలు సుఖం --ఇలా వచ్చి పోయేవి పశువులకు,పక్ష్యులకు ఫరవాలేదు కాని మన లాంటి మనుష్యులకు మంచిది కాదు.అందుకే చూడండి పాశ్చత్య దేశాల్లో కోటీశ్వరులు,వయసు ముదిరినవారు తరువాత చేస్తున్నదేమిటో తెలుసా? విలాస జీవితంలో సుఖం లేదని తమ సంపదను పేద వాళ్ళకు పంచి పెడుతూ కాలం వెబుచ్చుతున్నారు.వాళ్ళు యువకులుగా వున్నప్పుడు వారికి ఇతరుల బాధలు పట్టలేదు.తమ స్వార్థం తప్ప మరేది ఆలోచించని వారు చివరకు మనము చెప్పిన మార్గం అంటే ఆధ్యాత్మిక దారిలోకి వచ్చెస్తున్నరు కదా అంటారు...శ్రీ దత్తోపంత్ ఠెంగ్డేజీ.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. భౌతిక,ఆధ్యాత్మిక పద్దతులను ప్రపంచానికి అందించిన పురాతన దేశం

    ReplyDelete