Breaking News

జాతీయ గీతం-1857

ఆనాడు మౌల్వీ లియాఖత్ అలీ రాసిన "పైగామ్-మే-అమల్" కవితను "జాతీయ గీతం-1857" శీర్షికతో రచయిత దివికుమార్ తెలుగులోకి అనువదించారు. ఆ అనువాదం జూలై 2007 నాటి ఇండియా మాసపత్రికలో ఈ విధంగా ప్రచురితమైంది.



"హిందూస్తాను మనదేశం - దీనికి మనమే విధాతలం
పవిత్ర జాతి మా దేశం - స్వర్గం కంటే మహాప్రియం
సమస్త సంపద మాదేలే - హిందూస్తాను మనదేలే
దీని భాగ్యము శాంతి సౌఖ్యములు
వెలుగు చిమ్మును జగమంతా
అతి ప్రాచీనం ఎంతో ధాటి
దీనికి లేదుర ఇలలో సాటి
గంగా యమునలు పారు నిండుగ
మానేలల్లో బంగరు పండగ
దిగువున పరుచుకున్న మైదానాలు
దిగ్గున ఎగసే సంద్రపుటలలు
మంచునిండిన ఎత్తు కొండలు
కావలి దండిగ మాకు అండగ
దూరం నుంచి వచ్చిన దుష్టులు
చేసిరి కంతిరి మారు చేష్టలు
జాతికి ఘనమౌ దేశాన్నంతా - దోచివేసిరి రెండు చేతులా
అమరవీరులు విసిరిన సవాలు - దేశవాసులు వినరండి
బానిస సంకెలు తెంపండి
నిప్పులవానై కురండి
హిందూ ముస్లిం సిక్కులందరం
ప్రియాతి ప్రియమౌ సోదరులం
ఇదిగిదిగో మన స్వతంత్ర జెండా
చేస్తాం సలాము గుండెల నిండా !"

- సాయినాథ్ రెడ్డి.

2 comments: