నేను చెప్పిందే చివరి మాట కాదు
'నేను చెప్పిందే చివరి మాట కాదు ' అన్న వినయవంతుడు శ్రీ దత్తొపంత్. అధర్వవేదం నుండి బైబిల్ వరకు, సంత్ జ్ఞానేశ్వర్ నుండి ఉమర్ ఖయ్యూం వరకు, డయోనీసియస్ నుండి కారల్ మార్క్స్ వరకు,పతంజలి యోగసూత్రాలు మొదలుకుని ఎమర్సన్,కార్లైల్ వరకు,కాళిదాస్ నుండి టెన్నిజన్ వరకు,ఏసుక్రీస్తు నుండి మహమ్మద్ ప్రవక్త వరకు, సంత్ రామదాస్ నుండి జోసెఫ్ మాజినీ వరకు,నారద భక్తి సూత్రాల నుండి విశ్వగుణాదర్షనం వరకు అనేక సంఘటనలు అలవోకగా,అద్భుత జ్ఞాపకశక్తితో వివరించగల మహనీయుడు,క్రియాశీలుడు,ప్రచారకుడు,మార్గదర్శకుడు శ్రీ దత్తోపంత్. స్వార్థం అనే సంకుచిత స్థాయి నుండి క్రమంగా కుటుంబం,సమాజం,దేశం,మానవజాతి అనే స్థాయిలను దాటి ప్రపంచంతో ఎకాత్మతను పొదటానికి 'ధర్మం' ఎలా ఉపకరిస్తుందో వివరించిన యోగి శ్రీ దత్తోపంత్.
- అప్పాల ప్రసాద్.
నేను చెప్పిందే చివరి మాట కాదు
ReplyDeletegood info
ReplyDelete