మేలుకో యువతా నిన్ను నీవు తెలుసుకో యువతా - Meluko Yuvatha Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
మేలుకో యువతా
నిన్ను నీవు
తెలుసుకో యువతా.
మత్తు మాయలో మునగకు !
మంచి భవితను చెరపకు !
క్షణిక సుఖమని మోసపోయి
శాశ్వతంగ దీపమార్పకు
మేలుకో యువతా
నిన్ను నీవు తెలుసుకో యువతా
గంజాయి గుప్పిట నీ గమ్యం ,
గతిని తప్పెను సోదరా !
జ్ఞాపకాలను జారవిడిచి,
జీవితం జడమాయెరా !
మాదక ద్రవ్యాలు నిన్ను
పతనమంచున త్రోసివేసెరా
మేలుకో యువతా
నిన్ను నీవు
తెలుసుకో యువతా
తల్లిదండ్రులు బాధతో
తట్టుకోలేని గాయం !
ఒంటరిగ నువు ఊగుతుంటే
చెదిరిపోయే స్నేహబంధం
చిరునవ్వులే చిందించు వయసున
ఘోర నరకపు అనుభవాలే
మేలుకో యువతా
నిన్ను నీవు
తెలుసుకో యువతా
ఆలోచనలాగి పోయే ,
ఆరోగ్యం చెదిరిపోయె
ఆత్మవిశ్వాసమ్ము లేక
ఆశయాలే ఆవిరయ్యె !
మత్తు వద్దని మొండిపట్టు
సంకల్పమె గట్టి పట్టు
మేలుకో యువతా
నిన్ను నీవు
తెలుసుకో యువతా
No comments