Breaking News

భారత జెన్ జీ లేవరా - Bharatha Genz Levara Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్

 

భారత జెన్ జీ … లేవరా!

భావ దాస్యము త్రెంచరా

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !!


అవినీతి -అక్రమాలు,

అన్యాయం అసహనాలు,

కులాల కుమ్ములాటలు ,

ఆస్తుల విధ్వంసాలు

సమస్యలన్నింటికి ఒకటే మూలం

అనుక్షణం క్షీణించే మన 'వ్యక్తిత్వం'...



భారత జెన్ జీ … లేవరా!

భావ దాస్యము త్రెంచరా

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !!



ఉద్యమాలు - ప్రభుత్వాల మార్చవచ్చునేమో..

వ్యక్తిత్వంతో - నవతరమే మారవచ్చు 

ఆందోళనలు - విధానాల మార్చవచ్చునేమో...

విలువలుంటె - నాగరికత నేర్వవచ్చు 


భారత జెన్ జీ… లేవరా!

భావ దాస్యము త్రెంచరా

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !



సంస్కరణలు- లీకేజిని ఆపవచ్చునేమో..

నిజాయితీని అందించని మార్పులు మనకేల?

చట్టాలు నేరస్తులను శిక్షించగలవేమో..

ఉత్తమపౌరులనెన్నటికీ సృష్టించలేవు 



భారత జెన్ జీ లేవరా!

భావ దాస్యము త్రెంచరా

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !



ఫారెస్ట్ చట్టం - అడవులను కాపాడవచ్చునేమో

ప్రకృతిపై గౌరవాన్ని అది పెంచలేదు కదా?

విద్యా సమస్యలపై - ఉద్యమించేది ఎందరో

నైతికవిద్య కావాలని ఉద్యమించేది ఎవ్వరో ?


భారత జెన్ జీ … లేవరా!

భావ దాస్యము త్రెంచరా

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !


ఆశయాల కంటె ముందు -నిజాయితీ కావాలి 

హక్కులు అడిగే ముందు- బాధ్యతలు నేర్వాలి 

విజయం కంటె ముందు -సేవాగుణముండాలి 

పోటీ పడటంకన్నా -కరుణా హృదయముండాలి 


భారత జెన్ జీ … లేవరా!

భావ దాస్యము త్రెంచరా!

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా !


స్వార్థం కంటె ముందు దేశం బాగుండాలి 

యోచించే వివేకులు పౌరులమై ఉండాలి  

ముందుతరానికి ఈ తరం స్ఫూర్తిని అందించాలి.. మహిమాన్విత కీర్తిపొంది చరిత్రలొ నిలవాలి 



భారత జెన్ జీ … లేవరా!

భావ దాస్యము త్రెంచరా!

క్యారెక్టర్ నీ పవర్ రా!

భవితకు లీడర్ నీవేరా

No comments