Sodari Sahodara Simha Nadam Cheyara Lyrics in Telugu - సోదరీ సహోదరా సింహ నాదం చేయరా
రచన - అప్పాల ప్రసాద్
అధైర్యం నీకెందుకు
దౌర్బల్యం చెందకు
ధీర శూరుడవీవెరా
కార్యశూరుడ నీవెరా
సోదరీ సహోదరా!
సింహ నాదం చేయరా
జనన మరణం చక్ర భ్రమణం
తప్పదెవ్వరికైననూ
శోకించుట తగదు నీకిక
ఆత్మ జ్ఞానం పొందరా
ప్రతిఫలం ఆశించకుండా
పనులు చేసే హక్కు నీది
పునర్జన్మను పొందకుండా
నిన్ను నీవు తెలియరా
సోదరీ సహోదరా!
సింహ నాదం చేయరా
సుఖం దుఃఖం పొందు వేళ
క్రుంగి,పొంగుట వద్దురా
రాగ భయ క్రోధాలు వీడి
స్థిత ప్రజ్ఞను పొందరా
కామక్రోధము సంచరించిన
మనుజులే నశియించురా
మంచి చెడ్డలు తెలియలేక
అధోగతి పాలవునురా
సోదరీ సహోదరా!
సింహ నాదం చేయరా
ఉత్తములు ఏ పనులు చేసిన
జనులు వారిని అనుసరింతురు
స్వధర్మమే ప్రమోదము
భయావహం పరధర్మము
ధర్మమెప్పుడు పతనమగునో
తనకు తానే ఉద్భవించును
సాధు పురుషుల రక్షణార్థం
సృష్టికర్తయే అవతరించును
సోదరీ సహోదరా!
సింహ నాదం చేయరా
విషయ మలినాలన్ని కడిగి
ఉద్దరించు ఆత్మను
శుద్ధ మనసే ఆత్మబంధువు
కోరికలె మన శత్రువు
సోదరీ సహోదరా!
సింహ నాదం చేయరా.
No comments