Breaking News

శ్రీ రంగనాథానంద స్వామి మాటల్లో బుద్దుడు అవతార పురుషుడు

బుద్దునికి బ్రాహ్మణులంటే గౌరవం. "ఓ బ్రహ్మణా! అల్ప విషయాలపై ఆసక్తి పతనానికి దారి తీస్తుంది. దివ్య తేజస్సుతో పగలు,రాత్రి ప్రకాశించే వాడు,చెడును విస్మరించే వాడు,మంచిని వినేవాడు.ధ్యానం లో వుండేవాడు బ్రాహ్మణుడు." అంటాడు బుద్దుడు.కేవలం ముండనం, పుట్టుక,కట్టు బొట్టు వల్ల బ్రాహ్మణుడు కాదంటాడు.

రావి చెట్టు క్రింద ధ్యానం పూర్తి చేసుకుని బుద్దుడు హరిణి వనానికి వచ్చి తన శిష్యులు ఐదుగురికీ తన రెండు ప్రసంగాల ద్వారా సందేశం వినిపిస్తాడు.ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఆసియా ఖండం అంతా ప్రభావితం అయింది. ఏ శక్తి కారణంగా ఇది జరిగిందో అర్థం చేసుకోండి.మొదటి ప్రసంగంలో మధ్యేమార్గం వివరించగా, రెండవ దానిలో అహంకారం తొలగించి ఆధ్యాత్మిక విలువలు చెప్పి మనమంతా ఒక్కటే అని చెప్పాడు.
ఐదుగురి నుండి 60 మందిని కలిసి అన్ని చోట్లా ప్రచారం చేశారు.బుద్దుడు కాశీ వెళ్లాడు. ఎనభయి సంవత్సరాలు బ్రతికాడు.ఆ తర్వాత క్రీ. పూర్వం 3 వ శతాబ్దిలో మౌర్య చక్రవర్తి కాలంలో శ్రీ లంక,మధ్య ఆసియా,అలెగ్జండ్రియా బౌద్దం వ్యాపింప చేశాడు. కేవలం నమ్మకాలు కాదు, శ్రద్ద,దృఢ విశ్వాసం మనలో ప్రవేశ పెట్టారు.
భారత ప్రభుత్వం బుద్దుడు చెప్పిన ధర్మ చక్ర ప్రవర్తనాయ ఆధారంగా జాతీయ పతాకం మధ్యలో ధర్మ చక్రం పెట్టింది.
బుద్దుడు ఒక యుగ ప్రవక్త.. ఆయన కంటే ముందు బాగా ప్రచారంలో వున్న మూఢాచారాలను నిర్మూలించడానికి అవతరించిన బుద్దుడిని కొందరే అర్థం చేసుకున్నారు. ఆయన చెప్పినవి అనుసరించిన వ్యక్తి గుణవంతుడు అవుతాడు. కొంత కాలానికి ఆ శక్తి బలహీనమై మళ్లీ కొత్త అవతారం అవసరం అవుతుంది.

- Appala Prasad garu

1 comment:

  1. బుద్దునికి బ్రాహ్మణులంటే గౌరవం. "ఓ బ్రహ్మణా! అల్ప విషయాలపై ఆసక్తి పతనానికి దారి తీస్తుంది. దివ్య తేజస్సుతో పగలు,రాత్రి ప్రకాశించే వాడు,చెడును విస్మరించే వాడు,మంచిని వినేవాడు.ధ్యానం లో వుండేవాడు బ్రాహ్మణుడు." అంటాడు బుద్దుడు.కేవలం ముండనం, పుట్టుక,కట్టు బొట్టు వల్ల బ్రాహ్మణుడు కాదంటాడు.

    ReplyDelete