Breaking News

డా అంబేడ్కర్ దృష్టిలో బౌద్ద ధర్మం సాంఘీక ప్రయోజనం కలిగించేది

డా అంబేడ్కర్ దృష్టిలో
బౌద్ద ధర్మం సాంఘీక ప్రయోజనం కలిగించేది.


శాక్యుల మరియు కొలియుల రాజ్యాల మధ్య ప్రవహించే రోహిణీ నదీ జలాల పంపిణీ విషయం లో శాక్యులు యుద్దం ప్రకటిస్తే సిద్దార్థుడు తండ్రి శుద్దోధనుడితో యుద్దం వద్దన్నాడు. కాని వినలేదు.అందుకే శాక్య రాజ్యం వదలి వెళ్లాడు. తరువాత యుద్దము ఆగిపోయింది. కాని సిద్దార్థుడు తిరిగి రాక బుద్దుడిగానే వుండిపోయి , ధర్మ ప్రచారం కోసమే తన జీవితాన్ని అర్పించాడు.
మైత్రి, న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం సామాజిక అంశాలే ముఖ్యం. మనసా వాచా కర్మణా స్వచ్ఛంగా వుండటమే ధర్మం. ప్రకృతికి అతీతమైనవీ ఏవీ ఊహించి నమ్మొద్దు.
ప్రజ్ణ,శీలం,కరుణ వుండాలి. సమాజంలో సమర్థత కంటె మంచితనానికి విలువ ఎక్కువ ఇవ్వాలి. ఆ మంచి తనం పెంచటమే బౌద్దం లక్ష్యం.
రాజు ధార్మికుడు కావాలి. న్యాయంగా ధనం ఆర్జించాలి. కుటుంబ సభ్యుల ను పోషించి సుఖ పెట్టాలి.బుద్దుడి వలెనే సత్య బద్దులం కావాలి.
అష్టాంగ మార్గం:
1. స్వతంత్ర మైన మనస్సు,స్వేచ్ఛగా ఆలోచించాలి
2. మంచి సంకల్పాలు వుండాలి
3. తోటి వారితో ఆదర భావం తో మాట్లాడాలి.
4.ఇతరులకు ఆహ్లాదం కలిగించే కార్యకలాపాలు వుండాలి.
5. మంచీ వాటినే ఎంచుకుని ఇతరులకు హాని చేయకుండా జీవించాలి.
6. జాగృత మనస్సు కోసం సాధన చేయాలి.
7. చెడు భావాలు మనస్సులో రాకుండా చూసుకోవాలి.
8. లొభం, ద్వేషం, సోమరితనం, జడత్వం,అనుమానం వీటిని అధిగమించాలి. సమాధి సాధన చేయాలి.

డా అంబెడ్కర్ బౌద్దం మన దేశం లో విస్తరించకుండా వుండటానికి కారణం మొఘలుల దౌర్జన్యం వల్లనే బౌద్ద భిక్షువులు ప్రాణాలరచేత పెట్టుకుని విదేశాలకు పారిపోయారని తెలిపారు.
కేవలం కూడు గుడ్డ మాత్రమే కావాలని ఏడ్చే కమ్యునిష్టులకు, ధర్మం లేకుండా నైతిక జీవనం గడపలేమని, మా తల్లిదండ్రులు నేర్పిన ధార్మిక విలువల వల్లనే తాను ఉన్నతంగా జీవించే ప్రయత్నం చేస్తున్నానని డా అంబెడ్కర్ తెలియజెసాడు.
నా ప్రజలను నేను బ్రతికి వున్నప్పుడే, బౌద్దం అనే ధర్మ మార్గం లో కలుపక పొతే, నా తరువాత విదేశీ భావ జాలం లో పడి పిడివాదులై, ఆలోచన కోల్పోయి, హింసోన్మాదులై, దేశ వ్యతిరేకులవుతారని ముందుగా ఊహించి హిందూ మతానికి నష్టం కలుగకుండా బౌద్దం లో చేరిన మహనీయుడు డా బి ఆర్ అంబెడ్కర్.

- Appala Prasad garu

1 comment:

  1. నా ప్రజలను నేను బ్రతికి వున్నప్పుడే, బౌద్దం అనే ధర్మ మార్గం లో కలుపక పొతే, నా తరువాత విదేశీ భావ జాలం లో పడి పిడివాదులై, ఆలోచన కోల్పోయి, హింసోన్మాదులై, దేశ వ్యతిరేకులవుతారని ముందుగా ఊహించి హిందూ మతానికి నష్టం కలుగకుండా బౌద్దం లో చేరిన మహనీయుడు డా బి ఆర్ అంబెడ్కర్.

    ReplyDelete