Breaking News

స్వామి వివేకానంద మాటల్లో బుద్ద భగవానుడు-Swami Vivekananda about Gautama Buddha

బుద్దుడనే పదం అనంతమైన జ్ణానానికి ప్రతీక. బుద్దుడికి స్వర్గం,ధనం,రాజ్యం అన్నిటినీ తిరస్కరించి,ఆర్యావర్త వీధుల్లో భిక్షాటనం గావించాడు. జంతుకొటి మేలు కోరాడు. పశుబలి వద్దన్నాడు. ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్మమార్గంలో ఉన్నత స్థితి ని పొందాడు.

నీకెవరూ సహాయపడరు. నీ మోక్షాన్ని నువ్వే పొందాలి.పుణ్య కార్యాలు చేస్తూనే ఉండాలి సద్భావంతో ఉండండి.అప్పుడు మాత్రమే దేవున్ని తెలుసుకోగలరు. దేవుడున్నాడా అని ప్రశ్నిస్తే తెలియదని చెప్పాడు.
ప్రపంచ దేశాలు బౌద్ద మత ప్రభావానికి గురయ్యాయి.మూఢ విశ్వాసాన్ని పెంచే పురోహిత వర్గాన్ని వ్యతిరేకించాడు.వేదాల్లో హైందవులు కనుగొన్న సత్యాన్ని దాచి వుంచే ఈ పురోహితుల నుండి ఉపనిశత్ సారాన్ని వివక్షత లేకుండా సామాన్యులందరికి వివరించారు.
చీమ కొరకైనా సరే జీవితం అర్పించాలి. గొర్రె పిల్లను బలి ఇవ్వటం వల్ల పుణ్యం వస్తే తనను బలి ఇవ్వమన్నాడు.
బుద్దుడి హృదయం సౌందర్యం వర్ణనాతీతమైనది. అయితే హైందవులు మాత్రం తమ భక్తికి మూలమైన దేవుడిని వదలి పెట్టరు.
బుద్దుని జీవితం ఒక ఆకర్షణ. ఆయనది ఎంత సాహసం!ఎంత దివ్య ప్రేమ. బుద్దుడు ఎవరినీ ఎన్నడూ దూషించ లేదు.భారత దేశం యవత్తూ బౌద్దాన్ని స్వీకరించలేదు. బుద్దుడి సిద్దాంతం మన కంటే విదేశీయులకు బాగా అర్థమయింది. రక్తపాతం లేకుండా విస్తరించింది.
బుద్దుడికి ముందు విగ్రహారాథన లేదు. బౌద్దులే బుద్ద విగ్రహానికి పూజించారు.

బౌద్ద మత పతనం బౌద్ద అనుచరుల వల్లనే జరిగింది. బౌద్ద సంఘం లో బుద్దుని పేరుతో జరిగిన విచ్చలవిడి అసాంఘిక కార్యకలాపాల వల్ల, తాంత్రిక ఆచారాల వల్ల అది పతనం అయింది. అయితే వీటిలో బుద్దుని దోషం ఏ మాత్రం లేదు.
గౌతముడు దీనుల , నిరు పేదల,బిచ్చ గాండ్ర తో కలిసి జీవించి జన సామాన్య భాష పాళీ లో సంభాషించి అందరికీ దగ్గరయ్యాడు.
(వైశాఖమాసం బుద్ద పూర్ణిమ మే 7,2020)
- Appala Prasad garu

1 comment:

  1. బుద్దుడనే పదం అనంతమైన జ్ణానానికి ప్రతీక. బుద్దుడికి స్వర్గం,ధనం,రాజ్యం అన్నిటినీ తిరస్కరించి,ఆర్యావర్త వీధుల్లో భిక్షాటనం గావించాడు. జంతుకొటి మేలు కోరాడు. పశుబలి వద్దన్నాడు. ఎటువంటి ఫలితం ఆశించకుండా కర్మమార్గంలో ఉన్నత స్థితి ని పొందాడు.

    ReplyDelete