మనుషులు చేసే తప్పులకు ఆ సంతానం అంతరిస్తున్నది
పెంగ్విన్ పక్షులు, సీల్ చేపలు పెట్టే సంతానం ఈ వాతావరణం లొనే..
మనుషులు చేసే తప్పులకు ఆ సంతానం అంతరిస్తున్నది.
మంచు ఎడారిని తలపించే అంటార్కిటికా లో 6నెలలు పగలు,6నెలలు రాత్రి వుంటుంది.ఏడాదికి ఒక్క సారే అస్టమయం అవుతుంది.
పెంగ్విన్, సీల్ జీవాలు సముద్ర జలాలు ఘనీభవించి వుంటేనే సంతానాన్ని ఉత్పత్తి చెస్తాయి. తినే ఆహారంగా పీతలు దొరికేదిప్పుడే. 6 నెలలు ఇక్కడ వుండి మిగతా 6నెలలు వేరే చోటికి వెళ్తాయి. ఒక వేళ ఉష్ణోగ్రత పెరిగితే,మంచు కరిగితె, పుట్టిన పిల్లల అవయవాలు సక్రమంగా రూపు దిద్దుకోక చచ్చి పోతాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగే వేగం పెరిగి,పెంగ్విన్ లు అంతరించె అవకాశం ఏర్పడింది.
సీల్ చేపలు మంచు గడ్డల క్రింద గాలి పీలుస్తూ ఎంత కాలమైనా వుండగలవు.పిల్లలు కూడా సురక్షితంగా వుంటాయి. మంచు కరిగితె ఉష్ణ ప్రాంతానికి చెందిన పెద్ద పెద్ద చేపలు దాడి చేసి సీల్ జీవులను తినేస్తాయి.
భూగోళం పైన 70 శాతం నీరు వుంటే వాటిలో అధిక భాగం సముద్రజలాలె.ప్రపంచానికి కావలసిన oxyzan 50శాతం పైగా సముద్ర జలాల నుండే వస్తుంది.భూమిపై వున్న వేడిని,కార్బన్ డయాక్సైడ్ ని గ్రహించి భూమిని చల్ల బరుస్తుంది. భూ ఉష్ణోగ్రత పెరగటం వల్ల ఎన్నో రకాల మత్స్య జాతులు అంతరించి పోతున్నాయి. ఇంకొక 30 సంవత్సరాలు 600 జాతుల చేపల పరిణామం తగ్గుతుంది. సముద్ర జలాల్లో oxyzan చేపలు నేరుగా కాకుండా మొప్పల ద్వారా పీల్చుకుంటాయి. నీటి పరిమాణం పెరిగితే చేపలు సముద్ర గర్భంలో లోకి వెళ్ళి oxyzan తక్కువగా పొందుతాయి.. అలాగే చేపలకు ఆహారమైన 'ఫైటొఫ్లాంక్టన్' అను మొక్కల పెరుగుదల నిలిచిపోతుంది.దాంతో ఆహారం లేక చేపలు అంతరించి పోతాయి.మనం చేస్తున్న పొరపాట్లు సముద్ర జీవుల ను బలిగొంటున్నది.
- అప్పాల ప్రసాద్ గారు.
మంచు ఎడారిని తలపించే అంటార్కిటికా లో 6నెలలు పగలు,6నెలలు రాత్రి వుంటుంది.ఏడాదికి ఒక్క సారే అస్టమయం అవుతుంది.
ReplyDelete