Breaking News

ప్రకృతి తో చెలగాటమాడుతున్న మనిషి

మన ప్రమేయం తోనే ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలుస్తుందా?

భూభాగమంతా మంచుతో కప్పబడి వుండే స్థానాల్లో మొదటిది అంటార్కిటికా,రెండవది గ్రీన్ లాండ్ ది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కెనడాకు ఈశాన్యంగా వుంది. పర్యాటకులు,సాహస కృత్యాలు చేసేవారి ని ఆకర్షించే అత్యల్ప జన సాంద్రత కలిగిన ప్రాంతం. 44,087 కిమీ తీర ప్రాంతం కలిగి, చుట్టూ 100 చిన్న చిన్న ద్వీపాలున్న గ్రీన్ లాండ్ లో ఊహించని రీతిలో మంచు కరుగుతుందనీ, ఇప్పటి వరకు 9వేల గిగా టన్నుల మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతున్నది. ఏడాదికి 186.4 గిగా టన్నులు కరుగుతున్నట్లు డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ శాస్త్ర వేత్తలు అధ్యయనం చెప్పిన విశయమిది. సహజంగా ఎండా కాలంలో మంచు కరుగుతుంది. కాని మన మనుష్యుల ప్రమేయం వల్లనే ఇది జరిగి భూగోళం పై అనేక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత పెరగడమే మంచు కరగడానికి కారణం. గ్రీన్ లాండ్ తో పాటు ఆర్కిటిక్ ప్రాంతంలో 3డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికమై పెను మార్పులు చోటు చేసుకుని, జలప్రళయం సంభవిస్తే భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పలేమని అమెరికన్ జియొఫిజికల్ యూనియన్ శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్రీ శ 1900 నుండి ఇప్పటి వరకు సముద్రమట్టం 25 మిల్లిమీటర్లు పెరిగింది. దీనితో సముద్ర జలాల ఉష్ణోగ్రత లో మార్పు వచ్చి సముద్ర జీవులకు ముప్పు ఏర్పడుతున్నది. ఉత్తర,దక్షిణ ధృవ ప్రాంతాల తో కరిగే మంచు భూగోళం పైన ఇతర ప్రాంతాల పై ప్రభావం చూపుతుంది.
పశ్చిమ అంటార్కిటికా లో అతి పెద్ద మంచు ఫలకం వుంది.అది కరగడానికి వేల సంవత్సరాలు పట్టొచ్చు అనుకున్నారు. కాని 200 సంవత్సరాల లోపునే అది జరగ వచ్చని నాసా శాస్త్ర వేత్తలు తెలుపుతున్నారు. భూమి మీద మన ప్రమేయం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రత యే దీనికి ప్రధాన కారణం.
అలాగే తూర్పు అంటార్కిటికా లో విస్తారం గా వున్న మంచు కూడా అంచనాలకు మించి కరిగి, సముద్ర మట్టం గురించిన ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని జర్మనీ పర్యావరణ వేత్తలు తెలుపుతూ, సముద్ర మట్టం పెరుగుదలను ఆపడం ఎవరితరమూ కాదనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. అలాగే తూర్పు అంటార్కిటికా లో విస్తారం గా వున్న మంచు కూడా అంచనాలకు మించి కరిగి, సముద్ర మట్టం గురించిన ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని జర్మనీ పర్యావరణ వేత్తలు తెలుపుతూ, సముద్ర మట్టం పెరుగుదలను ఆపడం ఎవరితరమూ కాదనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

    ReplyDelete