Breaking News

సముద్ర మట్టం పెరిగితే జరిగే విధ్వంసం భయంకరంగా ఉంటుంది

సునామీ జల ప్రళయం కన్నా ,

సముద్ర మట్టం పెరిగితే
జరిగే విధ్వంసం భయంకరంగా ఉంటుంది.

పర్యావరణం లో సంభవించే మార్పులతో సముద్రమట్టం పెరిగితే ఎక్కువగా దెబ్భ తినేది ఆసియా దేశాలకు చెందిన వారే.బంగ్లాదేశ్ వరదలకు గురై 18 కోట్లమంది నిరాశ్రయులవుతారు. సింగపూర్,హాంగ్ కాంగ్, షాంఘై,బీజింగ్ నగరాలు కనుమరుగుతాయి. తమిళ నాడు కి చెందిన 356 చ కిమీ భూ భాగం సముద్ర జలాల్లో కలిసి పొనుంది.

భూమిలో లభించే చమురు,బొగ్గు,గ్యాస్ వంటి శిలాజ ఇంధనం....వీటిని ఒక్కసారిగా దగ్ధం చెస్తే 12 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ధృవ ప్రాంతాలలో మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గించాలని ఒక ప్రొఫెసర్ సూచించారు.
ఏడాదికి సగటున 3 మిల్లీ మీటర్లు పెరుగుతున్నది.అమెరికా ,ఐరోపా లకు చెందిన ఉపగ్రహాల ఆధారంగా వాతావరణం జరుగు మార్పులను అంచనా వేశారు. గ్రీన్ లాండ్,అంటార్కిటికా లలో మంచు పెద్ద ఎత్తున కరుగుతున్నది. భూ ఉపరితలం వేడెక్కుతోంది.ధృవ ప్రాంతాలలో మంచు కొండలు కరుగు తున్నాయి.
ఐరోపా లోని నెదర్లాండు, జర్మనీలో హాంబర్గ్ తీర ప్రాంతం పూర్తిగా మునిగి పోతుంది. డెన్మార్క్ దేశం చిన్న దీవిగా కుంచించుకుని పోతుంది. వెన్నిస్ నగరం పూర్తిగా సముద్రం లో మునిగి పోతుంది. టోక్యో,హాంగ్ కాంగ్,షాంఘై, కోల్ కత్త ,హాంబర్గ్,న్యూయార్క్ వంటి నగరాలు మిగిలి ఉండాలంటే మంచు చెరియలు చెక్కు చెదరకుండా మనం వాయు కాలుష్యం నిరోధించాలి.
ప్రపంచ జనాభాలో 150 మిలియన్ ప్రజలు సముద్రానికి 1 మీటర్ ఎత్తు లోనే జీవిస్తున్నారు.ఉష్ణోగ్రత 2డిగ్రీల సెల్సియస్ పెరిగినా సముద్ర మట్టం 1మీటర్ ఎత్తు పెరిగి, మాల్దీవులు తువలు వంటి ద్వీప సముదాయం భూమ్మీద కనపడకుండా పోతాయి.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. భూమిలో లభించే చమురు,బొగ్గు,గ్యాస్ వంటి శిలాజ ఇంధనం....వీటిని ఒక్కసారిగా దగ్ధం చెస్తే 12 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ధృవ ప్రాంతాలలో మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతుంది.శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా తగ్గించాలని ఒక ప్రొఫెసర్ సూచించారు.

    ReplyDelete