Breaking News

కొందరు ప్రముఖుల మాటల్లో బుద్దుడు నాస్తికుడు కాదు

కొందరు ప్రముఖుల మాటల్లో బుద్దుడు నాస్తికుడు కాదు.
గొప్ప మానవతా వాది.


నిర్వాణం,చావు పుట్టుకలు, పునర్జన్మ, ధర్మం గురించి ప్రతి పాదించిన బుద్దుడు నాస్తికుడు కాదని శ్రీ రమణ మహర్షీ తెలిపారు. బుద్దుని ధర్మమే భగవంతుడని గాంధీజీ చెప్పారు.
బుద్దుని మానవత్వం కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ హృదయాన్ని కదిలించి అతని రచనల్లో ప్రజల సంక్షేమం గురించి గీతాలు ఆలాపించెలా చేసింది.
బుద్దుడు ఉపదేశించినది కొత్త మతం కాదు.ఉపనిషత్తుల మాదిరిగా జ్ణాన కాండకు ప్రాధాన్యత ఇచ్చాడు. బుద్దుడు హిందువు గా పుట్టాడు. హిందువుగా జీవించి,హిందువు గా మరణించాడని రాధాకృష్ణ పండితుడన్నాడు.
బుద్దుడు,రాముడు,క్రిష్ణుడు వీరెవరినీ ఒకరిని ఒకరితో పోల్చవద్దు. ఎవరి ఔన్నత్యం వారిదే..బుద్దుడు మరణించిన 300 సంవత్సరాల తరువాత పుస్తకాలు వ్రాశారు.కల్పనలు,మార్పులు, చేర్పులు సహజంగా వుంటాయి.
వయో వృద్దులను,రోగ గ్రస్థులను, మృతులను చూసి దుఖానికి అతీతమైన స్థితిని అన్వేషించాలని నిర్వాణ స్థితి ని పొంది భగవాన్ బుద్దుడయ్యాడని స్వామి పరిజ్ణేయానంద అంటారు.
ఋగ్వేదం, ఋషులు, ఋగ్వేద సంస్కృతిని బుద్దుడు వ్యతిరేకించ లేదు.బౌద్దం భారత్ లో అంతరించ లేదు.రూపాంతరం చెందింది. శైవ,బౌద్ద,వైష్ణవ సమన్వయం కనిపిస్తుంది.
ధమ్మపదం సుత్త పిటకం లోని ఖుద్దని కాయమ్ లో 26 పగ్గాల ఈ గ్రంథం లో 423 శ్లోకాలు వున్నాయి.వీటిలో కొన్ని పద్యాలు మహా భారతం, భగవద్గీత, మనుస్మృతి లోనూ సంస్కృత భాషలో వున్నాయని ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు అంటారు.
సిద్దార్థ గౌతముడు గురుకులంలో వేదాధ్యయనం చేశాడని పండిత ధర్మదేవ తెలిపారు.
దేశ బంధువుల కంటే ధర్మ బాంధవులే మిన్న అని తెలిపిన బౌద్దంలో జాతీయతకు చోటు లేకుండా పోయిందని, పరాయి దేశం వారు బౌద్దాన్ని తమ స్వలాభం కోసం బౌద్దం లో చేరి, అత్యాచారాల పర్వాలకీ తెర లేపారు. ఫలితంగా బౌద్దం పతనం కావటం తప్పనిసరి అయిందని శ్రీ దీన దయాల్ ఉపాధ్యాయ అన్నారు.
నామ మాత్ర వేద పాఠకులను, పవిత్రాచరణ లేని వారిని, పశుహింస మొదలగు ధర్మ విరుద్ద కార్యములను చేసేవారిని బుద్దుడు ఏవగించుకున్నాడు.
అసత్యమైన,అనిత్యమైన పదార్థాలు తొలగి పోగానే మానవుడు మోక్షం పొందుతాడని అదే నిర్వాణం అని బుద్దుడు బోధన.
- Appala Prasad garu

1 comment:


  1. నామ మాత్ర వేద పాఠకులను, పవిత్రాచరణ లేని వారిని, పశుహింస మొదలగు ధర్మ విరుద్ద కార్యములను చేసేవారిని బుద్దుడు ఏవగించుకున్నాడు.

    అసత్యమైన,అనిత్యమైన పదార్థాలు తొలగి పోగానే మానవుడు మోక్షం పొందుతాడని అదే నిర్వాణం అని బుద్దుడు బోధన.

    ReplyDelete