Breaking News

శాంతి దినోత్సవం నాడు ప్రపంచానికి వివేకుని శాంతి సందేశం


స్వామి వివేకానంద విశ్వమత మహాసభల్లో మాత దురభిమానం, మతం పేరిట జరిగే హింసాప్రవృత్తి, ప్రపంచపు శోచనీయ స్థితిని చూసి ఆవేదన వ్యక్తపరుస్తూ ప్రపంచానికి ఆయన ఇచ్చిన శాంతి సందేశమిది:

"విషాద నిశీధిలో కాంతిరేఖల్లా విశ్వమత మహాసభలు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ ఈ ఉదయం మ్రోగిన జేగంటలు మత చాందసత్వానికీ, మతం పేరిట జరిగే హింసాత్మక చర్యలకూ, మనుషుల మధ్య ఉండే విద్వేషాలకూ చావు గంటలు కావాలి. అందరం కలిసి ఈ దుష్టశక్తులను అణచి వేయాలి".

"ఇతర మతాల్ని అణగద్రొక్కి, ఏ ఒక్క మతమూ పైకేదగలేదు, ఇతర మతాల వినాశనాన్ని కోరే ఏ మతమూ బ్రతికి బట్టకట్టలేదు. ఏ ఒక్కరూ తమ తమ మతాలను మార్చుకోనక్కరలేదు, ఇతర మతాల్లోని మంచిని గ్రహించి, ఎవరి మతాన్ని వారు చిత్తశుద్ధితో అవలంబిస్తే గమ్యాన్ని చేరవచ్చు".

"పవిత్రత, పరిశుద్ధత అనేవి ఏ ఒక్కరి సొంతమూ కాదు, ప్రతీ మతమూ ఆధ్యాత్మిక ఉన్నతి నొందిన మహాత్ములను తయారు చేసింది. పరస్పర సహకారంతో, ఇతర మతాలలోని మంచిని గ్రహించి, ఆకళింపు చేసుకొని సమత, సమభావాలతో శాంతియుతంగా కలిసి జీవించాలి".

ఓం శాంతి శాంతి శాంతి:


వివేకుని మాటలు మనము ఆచరణలో పెడదాం.

జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.

7 comments:

  1. శాంతి దినోత్సవం నాడు ప్రపంచానికి వివేకుని శాంతి సందేశం.

    ReplyDelete
  2. om shanti shanti shantihi..

    ReplyDelete
  3. స్వామిజి సందేశం అద్భుతం.

    ReplyDelete
  4. నిజంగా ఆచరణలో పెట్టాల్సిన విషయం.

    ReplyDelete