ఈ సృష్టి ఉన్నంతవరకు ప్రతి క్షణం అమ్మకు జేజేలు
ఈ సృష్టి ఉన్నంతవరకు ప్రతి క్షణం అమ్మకు జేజేలు,
అమ్మ అనంత ప్రేమమూర్తి. అమ్మ అంటే సంవేదన, అమ్మ అంటే ఆత్మీయ భావన,అమ్మ అంటే అపరిమిత విశ్వాసం,అమ్మ అంటే జీవితమనే పుష్పంలో సుమధుర సుగంధం,అమ్మ అంటే ఏడుస్తూ,అల్లరి చేసే పిల్లల్ని సహనంతో పెంచి పోషించే కారుణ్య మూర్తి, అమ్మ అంటే తియ్యని నీటితో గలగల పారే నదీమ తల్లి.
అమ్మ అంటే నిద్ర పుచ్చే జోల పాట, పూజా పళ్ళెం,హారతి దీపం, మంత్ర జపం. అమ్మ అంటే మమతానురాగాలు పొంగే ప్రవాహ ధార. నిరాశతో,జడత్వంతో కదలనివారిని లేపే కోకిల గీతం, అమ్మ అంటే అర చేతుల్లో అలంకరించే మైదాకు, నుదుట సింధూరం, కుంకుమ.
అమ్మ అంటే గాయాలను మానిపే చల్లని ఔషధం, పరమాత్మ ఉన్నాడనడానికి ఏకైక సాక్షీభూతం. అమ్మ అంటే త్యాగం,తపస్సు, సేవా,అనుష్ఠానం,సాధన,జీవన యజ్ఞం. జీవనమనే రహదారిలో అంతం లేని ఆత్మ అనే సౌధం,అమ్మ అంటే కాశీ,మధుర,అయోధ్య,చార్ ధామ్,అమ్మ అంటే లక్ష్మీ,సరస్వతీ,పార్వతీ.
అమ్మ అంటే ఆలోచన,జ్ణాపిక, కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ, కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు ప్రాణం పోసే అమృత పాత్ర. అమ్మ అంటే భూమి,జగత్తు, పవిత్రం,వాత్సల్యం, స్ఫూర్తి, ప్రేరణ వికాసం, విజయం.
అమ్మ అంటే శక్తి, ముక్తిదాయిని. అమ్మ లేకుండా ఈ సృష్టి లేనే లేదు. అమ్మ కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అమ్మ కథకు ఆది లేదు. అమ్మను మించి ప్రపంచంలో ఏదీ కానరాదు. అమ్మను ఎవ్వరితో పోల్చలేము.
ప్రపంచంలోని అమ్మలందరికీ ఇవే పాదాభివందనాలు.
- Appala Prasad garu
ఈ సృష్టి ఉన్నంతవరకు ప్రతి క్షణం అమ్మకు జేజేలు
ReplyDelete