'స్వదేశీ' శబ్దం హృదయం నుండి పొంగి పొరలే సహజ సిద్ధమైన ఆత్మాభిమానం
1.దేవాలయం లో కళ్లు మూసుకుని భజన చేస్తూ 'భగవాన్!నీ రూపం అపురూపం, నీ కళ్లు అతి సుందరం' అంటూ భక్తితో జపించటం నేను కాదనను.కాని కళ్లు తెరిచి తమ చుట్టూ చూసుకుంటే లక్షలాది దీనులు,దుఖి:తులు,నిర్భాగ్యులు ఆకలితో అలమటిస్తుంటే, ఆ దరిద్ర నారాయణ స్వరూపులకు కూడా అన్నం పెట్టాలని స్వామి వివేకానంద సూచించాడంటే ఆర్థిక వికాసం గురించి స్వామీజీ కి ఎంత శ్రద్ద వుందో ఆలోచించండి.
1893లో జపాన్ నుండి అమెరికా పడవ లో ప్రయాణం చేస్తూ జంశెడ్జీ టాటా తో జరిగిన సంభాషణ స్వదేశీ చరిత్ర లొనే అపూర్వం. జపాన్ నుండి అగ్గిపెట్టెలు తెచ్చి భారత్ లో కొంత కమిషన్ కి అమ్ముతున్న విషయం తెలుసుకుని,భారత్ లొనే పరిశ్రమ పెట్టి 10మందికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకూడదు? అన్న స్వామీజీ ప్రశ్నయే ప్రేరణ గా మొదటి ఉక్కు ఫ్యాక్టరీ ని నెలకొల్పి,ముంబాయి లో నూతన శాస్త్రీయ పరిశొధన కేంద్రాన్ని స్థాపించిన జంశెడ్జీ టాటా అందరికీ ఆదర్శం.
2. డా అబ్దుల్ కలాం శాస్త్రవేత్త గా వున్న రోజుల్లో జరిగిన సంఘటన.
అంతరిక్షం లోనికి పంపే ఉపగ్రహాలను మొసుకుని పోయే క్రయొజనిక్ రాకేట్లను అడిగితే రష్యా,అమెరికా,జపాన్ తదితర దేశాలు తిరస్కరించాయి. ఆ రాకేట్లలో వుంచే డయాఫ్రేంలు ఇవ్వడానికి అమెరికా ఒప్పుకుని చివరి దశలో 'ఇది మా రక్షణ వ్యూహం లో భాగం కాబట్టి ఇవ్వలెము' అన్నది. డయా ఫ్రేములలో వుంచే రాడ్ లు జపాన్ నుంచి వస్తాయి.జపాన్ రాడ్ లు ఇవ్వలేదు. వాటిలో ఉపయోగించే ముడి ఖనిజం పేరు 'బెరిలియం'. ఇది మన ఝర్ఖండ్ లో విరివిగా దొరుకుతుంది.వెంటనే డా కలాం సూచన మేరకు మన ప్రభుత్వం బెరిలియం ఎగుమతిని 4సంవత్సరాలు నిశేధించడం జరిగింది.స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో క్రయొజనిక్ రాకేట్లు తయారయ్యాయి.
విదేశాలపై ఆధారపడితే దీర్ఘ కాలం లో బానిసత్వం తప్పదు.
- అప్పాల ప్రసాద్ గారు
విదేశాలపై ఆధారపడితే దీర్ఘ కాలం లో బానిసత్వం తప్పదు.
ReplyDelete