Breaking News

స్వదేశీ ఉద్యమం-Swadeshi Movement History


ప్రభుత్వాల కంటే ప్రజలే విదేశీ వస్తువుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలరు. సంకల్ప శక్తి, దేశభక్తి వుంటే చాలు స్వదేశీ ని అందలమెక్కించగలరు. ఏ దేశమైనా స్వదేశీ భావన ధృడంగా వున్న ప్రజల అండ వుంటే ఆర్థికంగా సుదృఢం కాగలదు.
1.ఒకసారి ఇంగ్లాండ్ రాణి 'జర్మనీ కారు' ని కొనాలని నిర్ణయించినప్పుడు , దేశభక్తి గల ఇంగ్లాండ్ ప్రజలు నిరసన వ్యక్తం చేయగానే, రాణి తన నిర్నయాన్ని మార్చుకుంది.
2. ఇజ్రాయిల్ వందలాది సంవత్సరాలు స్వాతంత్ర్యం కోల్పోయి కాందిశీకులై, దేశ దేశాలు తిరుగుతూ 1948 లో స్వతంత్రం సాధించిన వెంటనే కొన్ని సంవత్సరాల అవధిలో ఎవరిపై ఆధార పడకుండా వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం ఇలా అన్ని రంగాల్లో యూదుల స్వదేశాభిమానం వల్ల పురోగతి సాధించింది.
3. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జపాన్ పైన వేసిన హైడ్రోజన్ బాంబు తో హిరొశిమా ,నాగాసాకి పట్టణాలు ధ్వంసమైనప్పుడు, ఆ మానవ కపాళాల నుండి, శిథిలాల నుండి స్వదేశీ నిష్ట తో పరిశ్రమ చేసి ఆర్థికంగా జపాన్ ను ఉన్నతంగా నిలబెట్టారు.
అ)కాలిఫోర్నియా (అమెరికా) నుండి సంత్రాలు దిగుమతై జపాన్ మార్కెట్లో ఉంచినప్పటికి ఏ ఒక్క జపాన్ పౌరుడు కొనకపోగా ఆ మురిగిన పండ్లను సముద్రం లో పడేశారు.
ఆ) జార్జ్ బుష్ పరిపాలనా కాలంలో మంచి సువాసన గల,సరసమైన ధర ఉన్న అమెరికా బియ్యాన్ని జపాన్ లో ఉంచినప్పటికినీ, జపాన్ రైతులు పండించిన బియ్యం తప్ప వేటిని ముట్టుకోలేదు.
ఇ) జపాన్ లో విదేశీ కార్లు 4 శాతం మాత్రమే అమ్ముడు పోతాయి.అమెరికన్ కార్లు 1.2శాతం మాత్రమే కొంటారు. అదే జపాన్ లో తయారైన కార్లు 15 శాతం అమెరికాలో కొంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయం గుర్తు చేసినా జపాన్ ప్రజలు వినలేదు.
ఈ) "Be american Buy american -అలాగే అమెరికా ఉద్యోగాలు- అమెరికా వారికి మాత్రమే " అంటూ స్వదేశీ భావన తోనే విదేశీ ఆధిపత్యం వ్యతిరేకించి చేసిన ప్రచారం వల్లనే ట్రంప్ అధ్యక్షులయ్యారు. చైనా వస్తువులపై అదనపు పనులు వేసి రక్షనాత్మక చర్యలు చేపట్టింది. సానా బాంగిరొని అను అమెరికా మహిళ 'A year without made in chaina' ఒక పుస్తకం వ్రాసి,చైనా వస్తువుల బండారాన్ని బయటపెట్టింది. ఒక సంవత్సరం పాటు చైనా వస్తువులు ఉపయొగించలెదు.

ఇలా స్వదేశీ అన్ని వేళల్లో అన్ని దేశాల్లో వికాసానికి ప్రతీక యని మనం భావించాలి.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. ప్రభుత్వాల కంటే ప్రజలే విదేశీ వస్తువుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలరు. సంకల్ప శక్తి, దేశభక్తి వుంటే చాలు స్వదేశీ ని అందలమెక్కించగలరు. ఏ దేశమైనా స్వదేశీ భావన ధృడంగా వున్న ప్రజల అండ వుంటే ఆర్థికంగా సుదృఢం కాగలదు.

    ReplyDelete