Breaking News

Swadeshi Movement Importance




1.స్వదేశీ,స్వాతంత్ర్యం,జాతీయ విద్యా , విదేశీ వస్తు బహిష్కరణ -- ఈ నాలుగు సూత్రాలు బోధిస్తూ స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమించిన దాదా భాయి నౌరోజి ఆడంబరం గల వ్యక్తి యైనప్పటికినీ ఆంగ్లేయులు 17 లక్షల కోట్ల రూపాయలు భారత్ నుండి తరలించుకుని పోయి,ఒకప్పటి బంగారు పిచ్చుక నేడు రెక్కలు విరిగి కరువు కాటకాలతో దరిద్రం తో విలవిల్లాడుతోందని వేదన చెంది భారత్ స్వేచ్చ కోసం ఉద్యమించారు.
2. మోతీ లాల్ నెహ్రూ (జవహర్ లాల్ నెహ్రూ తండ్రి) ధరించే దుస్తులు ప్యారిస్ లో ఇస్త్రీ చేసుకుని వస్తారు. ఎటువంటి ఆడంబరం గల వ్యక్తో ఊహించండి. అటువంటి ఆయనతో ఖద్దరు ధరింప చేసిన ఘనుడు గాంధీజీ.
3. గాంధీ- ఇర్విన్ ఒప్పందం సమయంలో వైస్రాయి ఇర్విన్ కోసం చాయ్ తీసుకుని రాగా,గాంధీజీ కోసం నిమ్మరసం వచ్చింది.చాయ్ లో ఇర్విన్ చక్కెర కలుపుకుంటే,గాంధీజీ తన వద్ద వున్న పొట్లం విప్పి ఉప్పు తీసి నిమ్మరసం లో కలిపాడు. ఇర్విన్ ఇదెమిటి?అని అడిగినప్పుడు "మా నిత్యావసర వస్తువైన ఉప్పు పై మీరు పన్ను విధించారు. ఆ శాసనాన్ని వ్యతిరేకిస్తూ మేము స్వయంగా తయారు చేసిన ఉప్పు కలుపుకుని మీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను"అని గాంధీజీ అన్నారు..ఇదీ స్వదేశీ భావన.
4. గాంధీజీ విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని గోపాల కృష్ణ గోఖలే గారిని కలిసి స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొనే విషయం ప్రస్తావించినప్పుడు,'సూట్ బూట్ వేసుకుంటే జనం నమ్మరు' అని చెప్పినప్పుడు గాంధీజీ మధురై వెళ్లి ధొవతీ ధరించి దేశమంతా తిరిగి ప్రజల హృదయాలను గెలుచుకున్న మహనీయుడు. అసేతు హిమాచలం ప్రజలతో మమేకమై స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించిన గౌరవనీయులు గాంధీజీ.

గాంధీజీ రాట్నం పట్టి నూలు వాడికినా, డా అబ్దుల్ కలాం రాకెట్ పట్టినా సందేశం ఒక్కటే.. స్వావలంబన కోసం స్వాతంత్ర్యం కావాలని ఒకరు, స్వాతంత్ర్యం కోసం దేశ సరిహద్దులు రక్షించు కొవాలని ఇంకొకరు. ఇద్దరు కూడా స్వదేశీ కోసం పరితపించిన వారే...
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. గాంధీజీ రాట్నం పట్టి నూలు వాడికినా, డా అబ్దుల్ కలాం రాకెట్ పట్టినా సందేశం ఒక్కటే.. స్వావలంబన కోసం స్వాతంత్ర్యం కావాలని ఒకరు, స్వాతంత్ర్యం కోసం దేశ సరిహద్దులు రక్షించు కొవాలని ఇంకొకరు. ఇద్దరు కూడా స్వదేశీ కోసం పరితపించిన వారే.

    ReplyDelete