Breaking News

నిత్య జనగణమన-జయహో కోరుట్ల


నూటొక్క జెండాలను జనవరి ఒకటి నెగురవేసి 

తెలుగు బుక్ రికార్డులను జాతీయంగా తిరగ రాసి, 
తొమ్మిది గంటలకు నిత్యం , జనగణమన గీతానికి
శ్రీ కారం చుట్టిన కోరుట్లకు జయహో. .


కులాల మధ్య కుమ్ములాట - జనాలను విడదీస్తే 
జాతీయ గీతాలాపన - తెలుగు ప్రజల ప్రోగుజేసె
కుల మతాలకతీతంగ జెండకు దండం పెట్టిన 
కోరుట్ల ప్రజలందరికీ పేరు పేరున జయహో ..

కిరాణ వర్తక సంఘం వ్యాపారులు కూడి నేడు 
'జై భారత్ ' అందామని , రా రమ్మని పిలుపునిస్తె అక్షర , నిరక్షరాస్యులు, ధనిక, పేద జనం కదలి 
చేతులెత్తి జనగణమన పాడిన కోరుట్లకు జయహో..
- అప్పాల ప్రసాద్.






1 comment:

  1. 'జై భారత్ ' అందామని , రా రమ్మని పిలుపునిస్తె అక్షర , నిరక్షరాస్యులు, ధనిక, పేద జనం కదలి
    చేతులెత్తి జనగణమన పాడిన కోరుట్లకు జయహో..

    ReplyDelete