పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 10 / 50
1970లో దావణగెరె సంఘశిక్షావర్గకు శ్రీ గురూజీ వచ్చినపుడు అందరు ప్రచారకుల బైఠక్ ఏర్పాటుచేయబడింది. ఆరోజు మధ్యాహ్నం బౌద్ధిక్ కార్యక్రమంలో శ్రీ గురూజీ ' అనేకమంది స్వయంసేవకులు తమ దుస్తులు, వేషం, కేశ విన్యాసం మొదలగువాటిలో 'హిప్పి' లను అనుకరించడం ' పట్ల కాసింత అసమాధానాన్ని వెలిబుచ్చారు. ప్రచారకుల బైఠక్ లోనూ అది మళ్ళీ ప్రస్తావించబడింది.
అపుడు బైఠక్ లో ఉన్న అప్పటి కలబుర్గి ( గుల్బర్గా) విభాగ్ ప్రచారక్ శ్రీ బాబూరావ్ దేశాయ్ ' ఇదొక పెద్ద తప్పుగా మనం చూడటం సరైందేనా? మన స్వయంసేవకులు కూడా ఈ సమాజం నుండే వస్తారు. తమ చుట్టూ ఏముందో , ఏది ఫ్యాషన్ అన్పించుకుంటుందో దాన్నే వాళ్ళు అనుసరిస్తారు. అది ఒప్పు లేదా తప్పు అనే జ్ఞానం కూడా వారికి ఉండదు. దానిపట్ల వారు బుర్ర పాడుచేసుకోవడమూ ఉండదు ' అన్నారు.
అపుడు శ్రీ గురూజీ ' నిజంగా అమాయకులై ఆవిధంగా చేస్తున్నవారికి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరముంది. సమాజంలో కొందరు ఎల్లప్పుడూ నీతిమంతులుంటారు. వారికి నీతి ఏది, నీతి కానిది ఏది, యోగ్యమైనది ఏది, యోగ్యం కానిది ఏది అనేది స్వయంగా తెలిసి ఉంటుంది. వాళ్ళు నీతిమంతులుగానే వ్యవహరిస్తారు. ఇంకొందరుంటారు. వారికి కూడా నీతి, నీతి కానిది ఏమిటనేది తెలిసి ఉంటుంది. అయినా వారు నీతి కాని పనులలోనే నిమగ్నమవుతారు. అయితే తాము చేసింది తప్పు అన్పించినపుడు పశ్చాత్తాపపడి , తమను సరిచేసుకుని, నీతి మార్గంలోకి వస్తారు. అలాంటివారు ఒకసారి పొరబాటు పడ్డా , దాని గురించి తెలిశాక నీతిమంతులు కాగలరు. సమాజంలో మరొక వర్గం వారుంటారు. వారు నైతిక ఉదాసీనులు (amoral) వారికి నీతి ఏది, నీతి కానిది ఏది, యోగ్యం, అయోగ్యం ఏమిటి అనేది మాత్రం తెలీదు. వాళ్ళు వాటిగురించి బుర్ర పాడుచేసుకోరు కూడా. ఇతరులను అనుకరణ చేసేవారు ఎక్కువగా ఇలాంటివారే. ఇపుడు మన సమాజంలో ఎక్కువవుతున్నవారు ఈ మూడవ వర్గం వారే. తమ అజ్ఞానం కారణంగా వీరు సమాజంలో తమదైన రీతిలో నడుస్తూ ఉంటారు. వారికి మంచి , చెడు ఏమీ తెలీదు. వారికి అది ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక కూడా లేని కారణంగా , వారిని సరిచేయడమే కష్టమైన పని. అందువల్ల సమాజానికి వీరే అపాయకారులూ అవుతారు. అలాంటివారు అమాయకులై ఏమో చేస్తున్నారు అని భావిస్తూ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.
1970లో దావణగెరె సంఘశిక్షావర్గకు శ్రీ గురూజీ వచ్చినపుడు అందరు ప్రచారకుల బైఠక్ ఏర్పాటుచేయబడింది. ఆరోజు మధ్యాహ్నం బౌద్ధిక్ కార్యక్రమంలో శ్రీ గురూజీ ' అనేకమంది స్వయంసేవకులు తమ దుస్తులు, వేషం, కేశ విన్యాసం మొదలగువాటిలో 'హిప్పి' లను అనుకరించడం ' పట్ల కాసింత అసమాధానాన్ని వెలిబుచ్చారు. ప్రచారకుల బైఠక్ లోనూ అది మళ్ళీ ప్రస్తావించబడింది.
ReplyDelete