గుంటూరు జ్ఞాపకాలు
ప్రచారక్ గా గుంటూరు లో వెళ్ళిన కొత్త లో. అక్కడి యువకార్యకర్తల బృందం తో సన్నిహిత సంబంధం ఉండెది. భర్తెపూడి శ్రీనివాసు, కంభంపాటి వాసు
జైనేంద్ర, నరేంద్ర, మారుతి, రామకృష్ణ, సర్వేష్, మంగపతి,శ్రీకంఠ సుబ్రమణ్యం
పొలిసెట్టి శ్రీనవాస్ అన్ని శాఖల్లొ గుంపులుగా కుర్రోళ్లు తిరుగుతుండే వాళ్ళం.
వాసు వాళ్ల అన్న పెళ్ళి కి ఆహ్వానించా
డు. తను వండుకుని తింటూ నాకు పెట్టేవాడు. వాళ్ల శాఖలో బాల స్వయం సేవకులు పాట, సుభాషితమె కాదు, అమృతవచనము కూడా కంఠస్తం చెప్పేవారు. మంచి అనుశాసనయుత
ముగా శాఖ జరిగేది. పెళ్లి కి పోకపోతే ఫీల్ అవుతాడేమో.
ఇంతలో కొల్లా రాధాకృష్ణ గారు, మేము బయలు దేరుతున్నాం. నీవు వస్తావా? అన్నారు. మీరే చెప్పండి అన్నాను. ప్రచారకుల విషయం నేను కాదు భాగయ్య గారే, ఫోన్ చెయ్యనా అన్నారు. మేము మాట్లాడే చోటు సంఘ చాలక్ శ్రీ విష్ణువర్ధన్ రాజు గారింట్లో. అప్పుడు అందరి ఇళ్లల్లో ఫోన్లు ఉండేవి కాదు.
కొల్లా గారు విజయవాడ కార్యాలయం ఫోను చేస్తే భాగయ్య గారితో మాట్లడితే మీ ఇష్టం అన్నారు. కొల్లా గారితో కలిసి గురజాల ప్రక్కన పల్లె గుంతకు వెళ్లాను. తరువాత వారానికి ప్రచారకుల సమావేశం తేతలి లో జరిగింది. బైఠకుల్లొ భాగయ్య గారు ఈ విషయం ఎత్తారు. నా పేరు ప్రస్తావించ లేదు. మనం పూర్తి సమయం మన కార్యక్షెత్రానికి ఇచ్చి పని చేయడానికి వచ్చాము. మన కార్యక్షేత్రం కాని చోట శుభకార్యాలకు మనం వెళ్ళలా? అదీ మనం అనుమతి అడగడం కాకుండా స్థానిక కార్యకర్తలతో ఫొన్ చేయించి. ఎవ్వరం మాట్లాడ లేదు. సమావేశం తరువాత ఎవరు అలా చేసారు అని గుసగుసలు
నేను, భాగయ్య గారు కలిసి ఒకే ఇంటికి భొజనానికి వెళ్లాము. నేను భయపడుతూనే అడిగాను. తప్పు నేను చేసాను. నాకే చెప్పవచ్చుకదండి బైఠక్ లో చెప్పారు, అన్నాను వారు నన్ను దగ్గరకు తీసుకొని, తప్పు ఎవరైనా చేసే అవకాశం ఉంది. అందరికీ తప్పు అని తెలిస్తే చేయరు కదా! అందుకే సామూహికంగా చెప్పాను. నీవు కూడా తప్పు మళ్ళి చేయవు. ఇంతలో మేము భోంచేయాల్సిన ఇల్లు వచ్చింది.
- నరసింహా మూర్తి.
గుంటూరు జ్ఞాపకాలు
ReplyDelete