Breaking News

గురూజీ కుశాగ్రబుద్ది !


ఈ రోజు బ్రహ్మానంద గురూజీ కథ చదివాక నాకు అలాంటిదే గుర్తుకు వచ్చింది.

ఒక బైఠక్ లో ఒక శారీరక్ ప్రముఖ్ తో మాట్లాడుతూ ఒక ప్రయోగం సరిగా అర్థం కాక పోతే ఎలా నేర్పుతావు ? అని అడిగారు. విభాగశ: లో (ముక్కలుగా చేసి) నేర్పతాను, జవాబు.
అన్ని ప్రయోగాలు నేర్పగలవా?
ఎందుకు నేర్పలేము. అన్నీ నేర్పవచ్చు.
జవాబు.

అయితే ఉత్తిష్ట , సిద్ధ అన్నారు
శారీరక్ ప్రముఖ్ గురూజి ఆజ్ఞ పాటిస్తూ సిద్ద లోకి వచ్చారు. 
గురూజి క్షేప ప్రయోగం చెప్పారు.
క్షేప ప్రయోగం లో రెండు కాళ్ళని ఎగురుతూ (ఛాతికి మోకాళ్లు తగిలేట్టుగా) దిశ మార్చి తిరుగుతూ సిద్ద స్థితి కి రావడం. ఎగిరాక ఇక ఆగడం ఉండదు కదా! ఇక ముక్కలు చేసి నేర్పడం ఎలా? శారీరక్ ప్రముఖ్ నవ్వెసాడు. ఇది అలా చేయలేమని చెప్పేసాడు.

గురూజి యునివర్సిటీ లెక్చరర్ గా ఉండగా శాఖ లో చేరారు. శారీరక్ సరిగా చేసింది లేదు. తరువాత రిసర్చ్, లా చదవడం, రామాకృష్ణ మఠం లో సన్యాసం, ఆ తరువాత  సమఘానికి రావడం.  1940 లో సర్ సంఘచాలక్ గా అయ్యాక ఒక రోజు 6 గంటలు  ఏక ధాటిగా శారీరక్ నేర్చుకున్నారట. మళ్ళీ చేసె అవసరం వచ్చి ఉండదు. మరి ఇంత స్పష్టం గా ఎలా తెలుసో !  అందరికీ ఆశ్చర్యమే.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. ఒక బైఠక్ లో ఒక శారీరక్ ప్రముఖ్ తో మాట్లాడుతూ ఒక ప్రయోగం సరిగా అర్థం కాక పోతే ఎలా నేర్పుతావు ? అని అడిగారు.

    ReplyDelete