Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 1 / 50




1945 లో శ్రీ గురూజీ బెంగళూరు లోని గాంధీనగర్ సాయంశాఖకు వెళ్ళారు. బాల స్వయంసేవకులతో ' మీ శాఖలో చిన్న కథ చెప్పుకునే అలవాటు ఉందా? ' అనడిగి , తామే పంచతంత్రం లోని ఒక కథ చెప్పారు. గంగదత్తుడు అనే కప్పల రాజు మరియు ప్రియదర్శి అనే పాము కథ అది. కథా సారాంశం ఇంతే: ' ఒక బావిలో రాజ్యాన్ని పాలించే గంగదత్తుడి రాజకుటుంబంలో కలతలు రేగాయి. అవి పెరిగి పెద్దవై వాటిని అందరికీ నచ్చేలా పరిష్కరించడం సాధ్యం కాలేదు.దాంతో తన శత్రు బృందాన్ని అంతం చేయడంకోసం గంగదత్తుడు తమ కులశత్రువు అయిన ప్రియదర్శి సహాయం కోరుతాడు. ఆ బావికి వచ్చి స్థిరపడిన ప్రియదర్శి, ఒక్కొక్కటిగా గంగదత్తుడి శత్రువులను తింటూ, చివరకు తాను చేసిన సహాయానికి ప్రత్యుపకారంగా రాజు ఆప్తులనే తినడం ప్రారంభిస్తాడు. శత్రునాశనం కోసం తాను వేసిన ప్రణాళిక తనకే ప్రమాదం కొనితేవడంతో గంగదత్తుడు మిగిలిన తన కుటుంబంతో ఆ బావినే వదలి మరో బావికి వలసపోతాడు.'
కథ పూర్తయ్యాక బాల స్వయంసేవకులకు దానిలోని నీతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాలేదు. ' మనలో మనం పరస్పరం గొడవపడరాదు మరియు ఏ కారణంగానూ శత్రువును ఇంట్లోకి చేర్చుకోరాదు ' అని ఆ బాల స్వయంసేవకులే చెప్పారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. కథ పూర్తయ్యాక బాల స్వయంసేవకులకు దానిలోని నీతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాలేదు. ' మనలో మనం పరస్పరం గొడవపడరాదు మరియు ఏ కారణంగానూ శత్రువును ఇంట్లోకి చేర్చుకోరాదు ' అని ఆ బాల స్వయంసేవకులే చెప్పారు.

    ReplyDelete