పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 7 / 50
సంఘశిక్షణ మరియు శిక్షార్థి మనస్తత్వం గురించి శ్రీ గురూజీ ఒక ఉపన్యాసంలో ఇలా చెప్పారు:
వర్గలో శారీరక శిక్షణ నేర్చుకోవడం కష్టమేమీ కాదు. అయితే లక్ష్యంపెట్టి దాన్ని గ్రహించడమే అతి ప్రముఖమైనది. స్వయంగా నా అనుభవం ఇలాఉంది. నేను సంఘంలో ప్రవేశించగానే , వర్గ సర్వాధికారిగా బాధ్యత నిర్వర్తించాల్సి వచ్చినందున శిక్షార్థిగా మూడు ఏళ్ళ శిక్షణ పొందడానికి అవకాశమే లభించలేదు. ఈ లోపం నా మనస్సును ఎల్లప్పుడూ తొలిచివేసేది. అందుకోసం ఒక వర్గలో సంఘస్థాన్ లో ఉండగానే శారీరక్ లోని అన్ని విషయాలలో నిపుణుడైన ఒక శిక్షక్ తో, నాకు అదంతా నేర్పమని అడిగాను. సంఘస్థాన్ సమయం ముగిసేలోగా కేవలం రెండు గంటలలోపల అన్ని విషయాలలో మూడు సంవత్సరాల శిక్షణలో నేర్పేదంతా నేర్చుకున్నాను. ఇపుడు ఏ విషయంలోనైనా ఏ ప్రయోగమైనా పేరు విన్నంతనే ఎలాంటి తప్పులూ లేకుండా చేయగలననే విశ్వాసం నాకుంది. అది ఎలా సాధ్యమైంది? నేర్పేటపుడు శిక్షక్ చెప్పే వివరణను ధ్యాస పెట్టి విన్నాను. అలాగే అతడు చేసి చూపించేటపుడు దృష్టి మరల్చకుండా గమనించాను. మీకూ అది సాధ్యం. శారీరక శిక్షణ అంటే వాస్తవంగా మీ దృష్టిని సూక్ష్మస్థితికి తీసుకెళ్ళే శిక్షణే. కాసింత అభ్యాసంతో ప్రయోగాల కౌశల్యం తనంతట తాను వచ్చేస్తుంది. శారీరక్ అయినా, బౌద్ధిక్ అయినా మీరు " స్థిరచిత్తులు " అయితే శిక్షణ కఠినమేమీ కాదు. సమస్య వచ్చేదెక్కడ అంటే శిక్షణ సమయంలో మీ ధ్యాస, దృష్టి కేంద్రీకృతం కాకపోవడమనేదే.
శిక్షణలో " స్థిరచిత్తులు " కావాలనేది ఆయన విశేషంగా చెబుతుండిన పదం.
- బ్రహ్మానంద రెడ్డి.
సంఘశిక్షణ మరియు శిక్షార్థి మనస్తత్వం గురించి శ్రీ గురూజీ ఒక ఉపన్యాసంలో ఇలా చెప్పారు
ReplyDelete