Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 5 / 50




సంఘశిక్షావర్గలోని వ్యవస్థల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి శ్రీ గురూజీకి ఉండేదని తెలియజెప్పే సంఘటన ఇది :

1958 లో సంఘశిక్షావర్గ శివమొగ్గ లోని బ్రాహ్మణ విద్యార్థి వసతిగృహంలో మే నెలలో జరిగింది. ఆ వర్గలో శ్రీ గురూజీ 15,16,17 తేదీలలో ఉన్నారు. వసతి చిన్నది. ఆవరణ కూడా చిన్నదే. శౌచాలయాలు తక్కువ ఉన్నా తాత్కాలికంగా కట్టడానికి స్థలమూ లేదు. సమీపంలోనే రైల్వేలైన్ మరియు చిన్నచిన్న పొదలతో కూడిన బయలు ప్రదేశం ఉంది. అయితే ఊరి మధ్యలో ఉన్న స్థలం కావడంవల్ల శిక్షార్థులు తమ ప్రాతర్విధి కోసం ఆ బయలు ప్రదేశాన్ని వాడితే చుట్టుపక్కల ఉన్నవారు దుర్గంధం, ఆరోగ్యం పేరిట ఆక్షేపణ తెలపవచ్చు అనేది కాదనలేని విషయం. ఆ వర్గకు ప్రబంధప్రముఖ్ అయిన శ్రీ సూర్యనారాయణరావు
(సూరూజీ) గారికి ,ఈ సమస్యకు ఒక ఉపాయం తట్టింది. ఆయన దగ్గరలోని ఒక గ్రామస్తుడిని కలిసి ,అతడికున్న కొన్ని పందులతో సహా శివమొగ్గకు వచ్చి ఒక నెల రోజులు ఉండమని కోరారు. ఈ వ్యవస్థవల్ల శౌచాలయ సమస్య సులభంగా పరిష్కారమైంది. 

ప్రబంధకుల బైఠక్ లో శ్రీ గురూజీ ముందు ఈ విషయమూ చెప్పబడింది. అది విన్న శ్రీ గురూజీ గట్టిగా నవ్వి, మెచ్చుకున్నారు కూడా. తమదైన హాస్యశైలిలో ' ఆ గ్రామస్తుడినుండి కూడా శుల్క వసూలు చేశారా? ' అని అడిగేశారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. సంఘశిక్షావర్గలోని వ్యవస్థల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి శ్రీ గురూజీకి ఉండేదని తెలియజెప్పే సంఘటన ఇది

    ReplyDelete