పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 8 / 50
1969 ధార్వాడలో సంఘశిక్షావర్గ. ఏప్రిల్ 28,29,30 తేదీలలో శ్రీ గురూజీ వర్గలో ఉన్నారు. ఒక రోజు ఉదయం సంఘస్థాన్ కు వచ్చారు. ద్వితీయవర్షలో ఒక గణకు శ్రీ హరిభావ్ వఝె దండలో ద్వంద్వ యుద్ధం అభ్యాసం చేయిస్తున్నారు. ఒక శిక్షార్థి ని తన ముందు నిలబెట్టుకుని స్వయంగా ఆయనే ద్వంద్వయుద్ధంలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో ఆ శిక్షార్థి నుండి వచ్చిన దెబ్బ నుండి శ్రీ హరిభావు తప్పించుకున్నపుడు, సహజంగా శిక్షార్థి దండ నేలకు తాకింది. దాంతో హరిభావ్ దృష్టి నేలకు తాకిన అతడి దండ మీదకు వెళ్ళింది. శ్రీ గురూజీ అక్కడే నిలబడి ద్వంద్వయుద్ధం చూస్తున్నారు. ఆయన వెంటనే శ్రీ హరిభావు ను ఉద్దేశించి , ' మీరు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు గదా? మీ దృష్టి ,దండ నేలకు తగిలిన వైపుకు వెళ్ళిందేమిటి? ద్వంద్వ యుద్ధం లో మనం ఎల్లప్పుడూ చూడాల్సింది ఎదుటి శత్రువు దృష్టినే తప్ప అతడి దండను కాదు' అన్నారు.
వివిధ గణల్లో జరుగుతున్న శిక్షణను గమనించాక, ధ్వజం దగ్గరకొచ్చి శ్రీ హరిభావు ను పిలిపించారు. ఒక దండను తీసుకోమని ' భేద్ ' ఇవ్వమని చెప్పారు. అది చేసి చూపించాక ' ప్రభేద్ ' చేయమన్నారు. అదికూడా చేసి చూపాక , వెంటనే శ్రీ గురూజీ ' భేద 'కూ, ' ప్రభేద ' కూ వ్యత్యాసమేమిటి? వేర్వేరు పేర్లెందుకు? అనడిగారు. శ్రీ హరిభావ్ కు వెంటనే జవాబు తోచలేదు. అపుడు శ్రీ గురూజీయే ' జ్వలించు ' మరియు ' ప్రజ్వలించు ' అనడంలాంటిదే ఇది కూడా! ' ప్రజ్వలించు ' అనడంలో ఎక్కువ తీక్షణత తో మండించడం అనే ఇంగితం ఉంటుంది. చర్య(పని) ఒకటే అయినా భావం వేరే అవుతున్నందున దాని పరిణామమూ వేరే అవుతుంది. ' ప్రభేద ' కూడా ' భేద' కు చెందిన మరొక పద్ధతి.అయితే ఎక్కువ పరిణామకారి. ' భేద' లో కేవలం కుడిచెయ్యి శక్తి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎడమచెయ్యి దండనుండి ' మార్' సరైన స్థానానికి తగలడానికి ఆధారంగా కార్యం నిర్వహిస్తుందంతే. అయితే ' ప్రభేద ' లో రెండూ చేతుల శక్తి ఏక కాలంలో ఉపయోగించబడుతుంది ' అని తెలిపారు. దాని ప్రత్యక్ష ప్రదర్శన కూడా చేసి చూపారు.
శారీరిక శిక్షణ విషయంలో శ్రీ గురూజీ దృష్టి చాలా నిశితమూ, నిఖరమూ కూడా!
- బ్రహ్మానంద రెడ్డి.
1969 ధార్వాడలో సంఘశిక్షావర్గ. ఏప్రిల్ 28,29,30 తేదీలలో శ్రీ గురూజీ వర్గలో ఉన్నారు. ఒక రోజు ఉదయం సంఘస్థాన్ కు వచ్చారు. ద్వితీయవర్షలో ఒక గణకు శ్రీ హరిభావ్ వఝె దండలో ద్వంద్వ యుద్ధం అభ్యాసం చేయిస్తున్నారు. ఒక శిక్షార్థి ని తన ముందు నిలబెట్టుకుని స్వయంగా ఆయనే ద్వంద్వయుద్ధంలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో ఆ శిక్షార్థి నుండి వచ్చిన దెబ్బ నుండి శ్రీ హరిభావు తప్పించుకున్నపుడు, సహజంగా శిక్షార్థి దండ నేలకు తాకింది. దాంతో హరిభావ్ దృష్టి నేలకు తాకిన అతడి దండ మీదకు వెళ్ళింది.
ReplyDelete