పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 4 / 50
1954లో కర్ణాటక మరియు మద్రాస్ ప్రాంతాలకు కలిపి సంఘశిక్షావర్గ బెంగళూరులోని బసవనగుడిలో ఉన్న ఆచార్య పాఠశాల కళాశాలలో జరిగింది. శ్రీ గురూజీ వర్గలో మే 12,13,14 తేదీల్లో ఉన్నారు. ఒకరోజు వర్షం కురిసి బౌద్ధిక్ మంటపం కూలిపోవడంతో, బౌద్ధిక్ కార్యక్రమం దగ్గరలోని నరసింహరాజా కాలనీ లోని శ్రీరామమందిరపు హాల్ లో జరిగింది. ఆ రోజుల్లో బౌద్ధిక్ కాలాంశం సాయంత్రం సంఘస్థాన్ తర్వాత ఉంటుండేది.
ఆరోజు బౌద్ధిక్ కు ముందు వైయక్తిక్ గీత్ పాడిన వ్యక్తి కోయంబత్తూరులో ప్రచారక్ గా ఉండేవాడు. ఆయన ఎంపిక చేసుకున్న గీత్ ' బఢ రహే హై హమ్ నిరంతర ' అనే 8_10 నిమిషాలపాటు సాగే హిందీ గీత్. ప్రతి చరణంలో అయిదు పంక్తులున్న పాట అది. బౌద్ధిక్ కొరకు అందరూ చిన్న హాల్ లో కూర్చున్నారు. గీత్ పాడే వ్యక్తి శ్రీ గురూజీకి దగ్గరగా నిలబడాల్సి వచ్చింది. దాంతో బహుశా కాసింత బెరుకుతో మొదటి చరణం పాడేటపుడే ఒక పంక్తి మరచిపోయాడు. పాట ఆగిపోవడంతో శ్రీ గురూజీ ఆ పంక్తిని జ్ఞాపకం చేశారు. అయితే అందరిముందూ తాను పాటలోని పంక్తి మరచిపోయాననే భావన మనసులో కలిగిందేమో, ఆ ప్రచారక్ లో గలిబిలి మొదలైంది. చెమటలు పట్టాయి. దాంతో ప్రతి పంక్తి మరచిపోయేలా చేసింది. విశేషమేమిటంటే ఒక్కొక్క పంక్తిని శ్రీ గురూజీ ,అతడికి గుర్తుచేస్తూ, అతడితోనే పాటను పూర్తిగా పాడించారు.
తన సహచరుడి ఆత్మవిశ్వాసం క్రుంగిపోయినపుడు_ అది పాట పాడే సందర్భమే కావచ్చు_ అతడికి అవసరమైన సమాచారమిచ్చి అతడిలో ధైర్యం, విశ్వాసం నింపి, కోరుకున్న పనిని అతడి ద్వారానే పూర్తి చేయించాలనేది కార్యకర్తలకు ఈ సంఘటన ద్వారా అనుభవంలోకి వచ్చింది.
- బ్రహ్మానంద రెడ్డి.
తన సహచరుడి ఆత్మవిశ్వాసం క్రుంగిపోయినపుడు_ అది పాట పాడే సందర్భమే కావచ్చు_ అతడికి అవసరమైన సమాచారమిచ్చి అతడిలో ధైర్యం, విశ్వాసం నింపి, కోరుకున్న పనిని అతడి ద్వారానే పూర్తి చేయించాలనేది కార్యకర్తలకు ఈ సంఘటన ద్వారా అనుభవంలోకి వచ్చింది.
ReplyDelete