Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 6 / 50




1958 మే నెలలో శివమొగ్గ సంఘశిక్షావర్గ లో జరిగిన ప్రబంధకుల బైఠక్ లో మరొక సంఘటన.

వర్గలో శారీరక ప్రముఖ్ , బౌద్ధిక్ ప్రముఖ్ అనే బాధ్యతలున్నట్లే అధికారి విభాగ్ ప్రముఖ్ అనేది కూడా ఒకటి. ఆరోజుల్లో అధికారి విభాగ్ ప్రముఖ్ ను అతిథి ప్రముఖ్ అని పిలిచేవారు. ఆ వర్గలో అతిథి ప్రముఖ్ గా జ్యేష్ఠ ప్రచారక్ మరియు భారతీయ జనసంఘ్ నాయకుడూ అయిన శ్రీ జగన్నాథరావు జోషీ ఉన్నారు. బైఠక్ లో ఒక్కొక్క విభాగపు పరిచయం జరిగినపుడు , తమ వంతు రాగానే శ్రీ జగన్నాథ జోషీ నిలబడి తమ పరిచయం చేసి , అతిథి ప్రముఖ్ అనే బాధ్యతను చెప్పారు. తర్వాత జరిగిన ప్రశ్నోత్తరాలు ఇలా ఉన్నాయి :

శ్రీ గురూజీ: అతిథి ప్రముఖ్ పనులు ఏవేవి? 

శ్రీ జగన్నాథ జోషీ : వర్గలో ఉన్న, వర్గకు వచ్చే అధికారుల మరియు అతిథుల వసతి, ఆహారం, ఇతర వ్యవస్థలు సరిగా ఉండేలా చూసుకోవడం. 

శ్రీ గురూజీ : ఈ వ్యవస్థ మీరు ఈ రోజు ఎవరెవరికోసం చేస్తున్నారు? 

శ్రీ జోషీ: వర్గ శిబిరాధికారి, కార్యవాహతో ప్రారంభించి వర్గకు వచ్చిన శ్రీ గురూజీని చేర్చి అందరి అధికారుల పేర్లను , వారి బాధ్యతల సహితంగా చెప్పారు. అయితే పొరబాటుగా శ్రీ గురూజీ సహాయకులైన డా. ఆబాజీ థత్తే గారి పేరు చెప్పడం మరచిపోయారు. దాంతో...

శ్రీ గురూజీ: డా.ఆబాజీ పరిస్థితి ఏమిటి ? అని ప్రశ్నించారు. 

శ్రీ జోషీ : ఆయనా అతిథియే. 

శ్రీ గురూజీ: అయితే ఆయనకు సంఘంలో ఏ బాధ్యతా లేదుగదా? 

ఒక్క సెకండులో శ్రీ జగన్నాథరావు జోషీ బుర్ర చురుకుగా మారింది. ఆయన జవాబు ఠకీమని బయటకొచ్చింది. ' Man is known by the company he keeps ' ( ఒక వ్యక్తి పెద్దరికం అతడు ఎవరి సహవాసంలో ఉంటాడనే దానివల్ల గుర్తించబడుతుంది ) అన్నారు.

జవాబు విని శ్రీ గురూజీ నిండు మనసుతో నవ్వారు. తర్వాత మళ్ళీ ఇలా ప్రశ్నించారు: వర్గలో ఏ అతిథి లేనపుడు అతిథి ప్రముఖ్ పనేమిటి? 

శ్రీ జోషీ : అపుడు...(ఒక క్షణం ఆగి)... అపుడు నేనే ప్రముఖ అతిథి.

ఆ జవాబు వినబడగానే బైఠక్ లో బిగ్గరగా నవ్వులు. శ్రీ జగన్నాథరావు జోషీ ని శ్రీ గురూజీ కూర్చోమని సైగ చేశారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. ఆ జవాబు వినబడగానే బైఠక్ లో బిగ్గరగా నవ్వులు. శ్రీ జగన్నాథరావు జోషీ ని శ్రీ గురూజీ కూర్చోమని సైగ చేశారు.

    ReplyDelete