Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 3 / 50




1946 అక్టోబర్ 25-28 వరకూ కర్ణాటక ప్రాంత బైఠక్ ధార్వాడలో జరిగింది. ఈ బైఠకులు పూర్తిచేసుకుని ,అక్కడినుండి బయల్దేరబోతుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. 

హుబ్బళ్ళి కి సంఘచాలకులైన డా. శ్రీ గణపతిరావు వఝె గారింట్లో ఒక కుక్క ఉండేది. గణపతిరావు వఝె గారు ఎక్కడికెళ్ళినా , అది ఆయన వెంటే ఉంటుండేది. బైఠక్ కు వెళ్ళినా మరింకేదైనా కార్యక్రమానికి వెళ్ళినా, చివరకు ప్రభాత్ శాఖకూ వస్తుండేది. దాంతో హుబ్బళ్ళి స్వయంసేవకులంతా దానికి (సంఘచాలకుల కుక్క అయినందున) ' ప్రసిడెంట్ ' అని పేరుపెట్టారు. 

ధార్వాడలో ప్రాంత బైఠకులు ముగించుకుని శ్రీ గురూజీ హుబ్బళ్ళి వచ్చారు. ఆయనకు వీడ్కోలు చెప్పడానికి అనేకమంది హుబ్బళ్ళి రైల్వేస్టేషన్ కు వచ్చారు. శ్రీ గణపతిరావు వఝె గారితోబాటు 'ప్రెసిడెంట్' కూడా వచ్చింది. శ్రీ గురూజీ ప్లాట్ ఫారమ్ మీద అందరితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలో ప్రసిడెంట్ కు ఏమన్పించిందో, అది ఉన్నట్టుండి శ్రీ గురూజీ వద్దకెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి , కాళ్ళవద్ద పడి పొర్లాడటం ప్రారంభించింది. కాసేపటి తర్వాత కాసింత పక్కకు జరిగి ప్రశాంతంగా తన చివరి శ్వాస వదిలింది. దానికేమైందో తెలుసుకోవడానికి ముందే ఇహలోకాన్ని త్యజించింది. శ్రీ గురూజీ ' అరె...రె...శివ...శివా... అంటూ రైలెక్కారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. 1946 అక్టోబర్ 25-28 వరకూ కర్ణాటక ప్రాంత బైఠక్ ధార్వాడలో జరిగింది. ఈ బైఠకులు పూర్తిచేసుకుని ,అక్కడినుండి బయల్దేరబోతుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది.

    ReplyDelete