పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 2 / 50
1942 సెప్టంబర్ 30 న కర్ణాటకలోని బిజాపుర జిల్లా రబకవి అనే ఊరికి శ్రీ గురూజీ వచ్చారు. ఆ రోజుల్లో స్వాతంత్ర్య వీర సావర్కర్ అన్న గారైన శ్రీ బాబారావు సావర్కర్ జమఖండి అనే ఊర్లో ఉంటుండేవారు. శ్రీ గురూజీ రబకవి కి వస్తున్నారని తెలిసి ఒక ఉత్తరం వ్రాసి, జమఖండి కి చెందిన శ్రీ రఘునాథరావు పేండ్సె ద్వారా గురూజీకి పంపారు. అది చదివిన గురూజీ, రఘునాథరావుతో ' ఉత్తరం అందిందని బాబారావుగారికి తన నమస్కారాలతో సహా తెలపమని, రాబోయే ముప్పై సంవత్సరాల వరకూ నా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగదు అని భరోసా కల్గి ఉండాలని ' వారికి చెప్పమని కోరారు.
( శ్రీ గురూజీ క్యాన్సర్ పీడితులై ఇక పర్యటనే సాధ్యం కాదన్న స్థితికి చేరుకున్నది అప్పటికి ముప్పై సంవత్సరాల తర్వాత 1972 చివరినాటికి అన్నది గమనించాల్సిన విషయం.సరసంఘచాలకత్వపు తమ కాలావధి ఆయనకు ముందే తెలుసా?! కుతూహలం రేకెత్తించే విషయమిది.)
- బ్రహ్మానంద రెడ్డి.
శ్రీ గురూజీ క్యాన్సర్ పీడితులై ఇక పర్యటనే సాధ్యం కాదన్న స్థితికి చేరుకున్నది అప్పటికి ముప్పై సంవత్సరాల తర్వాత 1972 చివరినాటికి అన్నది గమనించాల్సిన విషయం.సరసంఘచాలకత్వపు తమ కాలావధి ఆయనకు ముందే తెలుసా?! కుతూహలం రేకెత్తించే విషయమిది.
ReplyDelete