Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 11 / 50



1971లో సంఘశిక్షావర్గ బెళగావి జిల్లా గోకాక్ లో జరిగింది. ఆ వర్గకు శ్రీ శివాజీరావ్ ధోండిబా జాదవ్ అనే వ్యాపారి సర్వాధికారిగా ఉన్నారు. ఆ వర్గలో మే11,12,13 తేదీలలో ఉన్న శ్రీ గురూజీకి శ్రీ జాదవ్ గారింట్లో వ్యవస్థ చేయబడింది. ఆయన ఆ ఇంటికి వెళ్ళగానే, శ్రీ జాదవ్ గారి భార్య, కోడలు ఆచారం ప్రకారం శ్రీ గురూజీకి హారతి ఇచ్చారు. అయితే హారతిపళ్ళెంలో అగ్గిపెట్టె అలాగే ఉండిపోవడం వారిరువురూ గమనించలేదు. అది శ్రీ గురూజీ గమనించారు. హారతిపళ్ళెంలో ఉండాల్సింది కుంకుమభరిణె తప్ప అగ్గిపెట్టె కాదు అంటూ పొరబాటును వినమ్రంగా వారి దృష్టికి తెచ్చారు. 

స్నానానికి వెళ్ళేముందు శ్రీ గురూజీ , ఇంట్లో తులసి బృందావనం ఎక్కడ అనడిగారు. శ్రీ శివాజీరావ్ ధోండిబా జాదవ్ గారి భార్య దాన్ని చూపించింది. అక్కడే ఉన్న ఆమె కోడలు ,బృందావనం ఎందుకు? అని కాసింత ఎకసక్కెంగా అడిగింది. దానికి చాలా సహజంగా శ్రీ గురూజీ , ' తులసి బృందావనం ఉన్నచోట సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ స్నానానంతరం తులసి పూజ చేయాలి' అని ఆమెకు తెలిపారు. 

రెండవరోజు ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి తోటలోని మొక్కలకు కడవతో నీరు పోస్తుండటాన్ని చూసిన శ్రీ గురూజీ , అతడివద్దకెళ్ళి ' మొక్కలకు నీరు పోసే పద్ధతి ఇది కాదు. ఈ విధంగా నీరు పోస్తే మొక్కల వేర్లు విడివడిపోతాయి. నీరు పోయాల్సింది మొక్కల మొదలుకు సన్నటి ధారగానే. అది కూడా పైనుండి నీటిని కేవలం వెదజల్లాలి అని స్వయంగా మొక్కలకు నీరు పోసి చూపడంతోబాటు, ఇలా చేస్తే పువ్వులు బాగా పూస్తాయి ' అని ఆ పనిచేసే వ్యక్తితో అన్నారు. 

ఇంటికి అతిథిగా వచ్చిన ఓ పెద్దాయన తనలాంటి సామాన్యుడితోనూ మాట్లాడి , మొక్కలకు ఎలా నీళ్ళు పోయాలో చేసి చూపారనేది అతడు జీవితాంతం మరచిపోలేని సంఘటన అయి ఉంటుంది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. ఇంటికి అతిథిగా వచ్చిన ఓ పెద్దాయన తనలాంటి సామాన్యుడితోనూ మాట్లాడి , మొక్కలకు ఎలా నీళ్ళు పోయాలో చేసి చూపారనేది అతడు జీవితాంతం మరచిపోలేని సంఘటన అయి ఉంటుంది.

    ReplyDelete