1857 - 1947--స్వాతంత్ర్య సమరం (1857 Freedom Movement)
1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి దారి తీసిన కారణాల్లో ఆంగ్ల ప్రభుత్వం చేసిన మత మార్పిడి ఒకటి.
క్రైస్తవ మత మార్పిడి ఆంగ్లేయుల దాడిలో ఒక భాగం.ఆంగ్లేయులు కేవలం ఆర్థికంగా,రాజకీయంగా మాత్రమే కాదు భారతీయుల విశ్వాసం పైన కూడా దాడులు చేశారు.
హిందువులు క్రైస్తవం లోకి మారితే, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడే దేశభక్తిని కోల్పొతారని స్వతంత్ర్య పోరాటం చేయరని ఆంగ్లేయులు పథకం వేశారు.భారత్ ని పూర్తిగా క్రైస్తవమయం చేస్తే దేశం శాశ్వతంగా తమ చేతుల్లోకి వస్తుందని బ్రిటిష్ పార్లమెంట్లో తీర్మానం చేశారు. క్రైస్తవ మిషనరీలు వేగంగా మతమార్పిడి ప్రారభించారు.వీధుల్లో హిందువుల విగ్రహాలను తూలనాడుతూ ఉపన్యసించటం మొదలు పెట్టారు.కొన్ని వేల సంవత్సరాలుగా నెలకొని వున్న సామాజిక వ్యవస్థను,సంస్కృతిపై దాడి మొదలుపెట్టారు.
తరతరాలుగ ఉన్నతమైన ధర్మంగా వెలసిల్లిన మన సంస్కృతిపై క్రైస్తవ ఆధిపత్యాన్ని రుద్దటం కోసం హిందువుల విశ్వాసాలను పరిహసించసాగారు.మానసికంగా కోట్లాది హిందువులు వేదనకు గురయ్యారు.హిందువుల సమాజ వ్యవస్థను,విశ్వాసాలను,వేదాంతాన్ని పూర్తిగా లేకుండా చేయటమే లక్ష్యంగా ఆంగ్లేయులు కుట్ర పన్నారు.క్రైస్తవ మిషనరీలకు ఆంగ్లేయ ప్రభుత్వం పూర్తిగా మతమార్పిడులకు ప్రొత్సాహాన్నిచ్చింది.మందిరాలకు తాళాలు వేశారు.హిందువులను, ముస్లిములను పాపాత్ములని పేర్కొంటూ,అధికారికంగా, ప్రైవేట్ పత్రాల్లో ప్రచురించి పంచారు.
భారతీయ సైనికుల మధ్యలో క్రైస్తవ ప్రార్థనలు,రామున్ని,కృష్ణున్ని అవమానించే ఉపన్యాసాలు ఇచ్చారు.సైనికులను మతమార్పిడి చేస్తూవచ్చారు.మతం మారితే 'హవల్దార్ లేదా 'సుబేదార్ మేజర్ ' గా హోదా కల్పించే ప్రలోభాలు చూపేవారు.
హిందువులను సైతాన్ల(హిందూ దేవుళ్ళ) చేతుల్లో నుండి ఏసు తండ్రి ఒడిలోకి తీసుకుని రావటానికి 28 సంవత్సరాలుగ పనిచెస్తున్నట్లు ఒక ఆంగ్లేయ అధికారి చెప్పాడు.
- అప్పాల ప్రసాద్.
1857-1947 Freedom Movement...
ReplyDeleteనీకు ఏం తెలుసని ఇంత సోది రాసావు ..ఓయ్ అప్పా రావ్.......భారతీయులను క్రైస్తవ్యం లోనికి మారిస్తే స్వాతంత్ర్య పోరాటం చేయరు అని బ్రిటిష్ వారు అనుకున్నారా...?
ReplyDeleteబ్రిటిష్ వారికీ క్రైస్తవ్యానికీ సంబంధం ఏంటయ్యా..అసలు...
క్రైస్తవ్యం మా భారత దేశంలో ఎప్పటిదో నీకు తెలుసా? క్రీ. శ. 52 లో క్రీస్తు శిష్యులలో ఒకరైన తోమా ....కేరళ వచ్చి సువార్త ప్రారంభించగా....అనేక బ్రాహ్మణ కుటుంబాలు నిజ దేవుని నమ్ముకున్నాయి...నాటి నుండి ఒకరి నుండి ఒకరు.....సత్యాన్ని తెలుకున్నారు...మరి బ్రిటిష్ వాడు ఎప్పుడన్నా నిన్న గాక మొన్న మహా అయితే ఓ 300 సం. క్రితం
క్రీ. శ 52 నాటికి బ్రిటిష్ వాడు ఎక్కడ?
అమెరికా ఎక్కడ?
నువ్వెక్కడ?
ఇలాంటి సోది ఇంకెప్పుడూ రాయకు...
అవునంట మరిచి పోయాను చెప్పటం....నీకు
నీకు వీలైతే స్వాతంత్ర్య సమరం లో ఎంత మంది క్రైస్తవులు పాల్గొన్నారో తెలుసుకో...
తెలీకపోతే....సోది బ్లాడర్ మూసై