Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Fighters)


ప్రపంచంలోనే ఒక అద్భుతమైన మహా యుద్ధానికి (1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి) రూపకల్పన చేసిన భారతీయ శూరులు వీరు.

ఎర్ర గులాబీ , ఒక రొట్టె ముక్క దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆయా రాజులకు చేర్చారు. రాజులు అది స్వీకరించి స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికారు.నానా సాహెబ్ పీష్వా దిల్లీ నుండి మైసూర్ వరకు వున్న రాజులందరికి,ఉత్తరాలపై ఉత్తరాలు వ్రాస్తూ సమరానికి సన్నద్ధపరిచే ప్రయత్నం చేశాడు.

నానా సాహెబ్ పీష్వా(19 మే 1824-1857)..

రెండవ బాజీరావ్ దత్తత పుత్రుడు..మహరాష్ట్రా యోధుడు.సంస్కృతంలో పండితుడు.కంపనీ ఇచ్చే పెన్షన్ ని తిరస్కరించి,1857 ప్రథమ స్వతంత్ర్య పోరాటాన్ని నడిపిన సంఘటన నాయకుడు.బిట్టూర్ (కాన్ పూర్) నుండి ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు. గెలిచి పీష్వా గా ప్రకటించుకున్నాడు.

నానా చిన్నప్పటి స్నేహితులు ఎవరో తెలుసా? తాత్యా తోపే,అజీముల్లాఖాన్,మణికర్ణిక(రాణి లక్ష్మిబాయి).ఈ బాల్యా స్నేహితులే ఆ తరువాతి కాలంలో 4 లక్షల నాయకుల నాయకత్వంలో 4కొట్లమంది ప్రజలు నడిపిన 1857 పోరాటానికి నేత్రుత్వం వహించారంటే నేటి పిల్లలే భావిభారత యోధులని ఋజువు చేశారు.

సంతానం లేని రాజుల రాజ్యాలను, ఆ రాజుల తరువాత కంపనీ కి చెందుతాయని ఇంగ్లండ్ అధికారి డల్ హౌజీ ఆజ్ఞ జారీ చేసి, సతారా,జయపూర్,సంభాల్పూర్,అవధ్,నాగపూర్,ఝాన్సీ లను స్వాధీనం చేసుకున్నారు.

దానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది.అజీముల్ల ఖాన్ ఇంగ్లాండ్ వెళ్ళి కేసుని వాదించాడు..ఇంగ్లిష్ వారికి విరుద్ధంగా వున్నవారిని కలిసి అజీముల్లా ఖాన్ మంతనాలు జరిపాడు.

ఆంగ్లెయులు కుటిలనీతి తో మళ్ళీ కాన్ పూర్ ని ఆక్రమించారు..నానా సాహెబ్ తప్పించుకుని వెళ్ళాడు.నేపాల్ వెళ్ళి అక్కడే 1859 లొ మరణించాడని చెపుతారు.

ఝాన్సీ లక్ష్మీ బాయి(19 నవంబర్ 1828- 17 జూన్ 1857)

ఇంగ్లండ్ అధికారి సిర్ హగ్ రోజ్ తో యుద్ధం జరిగింది. అప్పటికే జరిగిన కొన్ని యుద్ధాల్లో విజయం సాధించింది.కాని ఆ చివరియుద్ధంలో వీర మరణం పొందింది.రోజ్ అధికారి ఈమెను ఒక ప్రమాదకరమైన నాయకురాలిగా వర్ణించాడు.కల్నల్ మెల్లెసన్ భారతీయులు వీరోచితమైఅన్ పోరు సల్పిన ఈ రాణిని ఎప్పటికీ మరిచిపోరని తెలిపాడు.

తాంతియా తోపే..(1814-18 ఏప్రిల్ 1859) ..

నానా సాహెబ్ కి కుడి భుజమై కాన్ పూర్ యుద్ధం లో బ్రిటిష్ సేనలను ఓడించాడు.ఆ తరువాత గ్వాలియర్ కి వెల్లి లక్ష్మీబాయి కి తోడుగా యుద్ధం చేశాడు.20000 సైన్యానికి నేతృత్వం వహించాడు.మాన్ సింగ్ అనే భారతీయుడి ద్రోహం కారణంగా అడవిలో నిద్ర పోతున్నప్పుడు పట్టుబడ్డాడు.తన మాస్టర్ నానాసాహెబ్ కి తప్ప ఎవరికీ తాను జవాబుదారుని కాదని కుండబద్దలు కొట్టినంట్లు చెపుతాడు. ఆంగ్లేయులు అతన్ని ఉరి తీస్తారు.

అజీముల్లా ఖాన్ (1830-1959)..

నానాసాహెబ్ కి ముఖ్య అనుచరుడు.విప్లవ దూత గా పేరుపొందిన వీరుడు.ఇంగ్లిష్ మరియు ఫ్రెంచ్ భాషలు వచ్చును.కరువు కాటకాల మధ్యలో ఆకలితో అలమటించిన ఇతని కుటుంబం ఆ తరువాతి కాలం లో నానా సాహెబ్ దగ్గర చేరి, 1857 యుద్ధం లో ప్రముఖ పాత్ర పోషించాడు.1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించాలని నానా సాహెబ్ కి సలహా ఇచ్చిందని అజీముల్లా ఖానేనని చెపుతారు.

1853 లొ ఇంగ్లండ్ వెళ్ళి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లొ బ్రిటిష్ చట్టాల వల్ల తమ దేశానికి వచ్చిన ప్రమాదాల గురించి వాదించాడు. ఆ తరువాత తీవ్రమైన జ్వరంతో అజీముల్లా చనిపోతాడు.

రంగో బాపుజి ...1839 లో సతార రాజ్యాన్ని ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నప్పుడు, ఎంగ్లాండ్ కి 14 ఏళ్ళు అక్కడే వుండి కేసు నడిపిస్తాడు.ఆ తరువాత వచ్చి 1857 యుద్ధానికి మాస్టర్ మైండ్ గా వ్యవహరిస్తాడు. సతారా, సాంగ్లీ,కొల్ హాపూర్,బెల్గావ్ ప్రాంతాలు వెళ్ళి,విప్లవానికి ఆజ్యం పోస్తాడు.
కోట్లాది భారతీయులు మరిచిన వీరుడు ఇతడు.భవిష్యత్ తరాలకు చెప్పలెని మన ప్రభుత్వాలు, పాఠ్య పుస్తకాల్లో ప్రచురించని కథా నాయకుడు.

వాసుదేవ్ బలవంత్ ఫడ్కే (4 నవంబర్ 1845-17 ఫిబ్రవరి 1883)

రైతు కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డడు ప్రథమ స్వతంత్ర్య పోరాట పుటలలో మొదటి పేజిలో కనపడతాడు.మహరాష్ట్రా లోని కల్యాణ్ దగ్గర శిర్డోన్ లొ పుట్టిన వాసుదేవ్ బలవంత్ ఫడ్కే చిన్నప్పటినుండి తాతయ్య ద్వారా దేశభక్తి కథలు వినేవాడు.చదువు పూర్తిచేసుకుని,మిల్ట్రీ ఫైనాన్స్ ఆఫీస్ లొ ఉద్యోగం చెస్తాడు.తల్లి చావు బతుకుల్లో వుంటే కూడా వాసుదేవ్ కి సెలవు ఇవ్వదు ప్రభుత్వం.తల్లికి సేవ చేసేందుకు సెలవు కోరుతాడు.ఐన లాభం లేదు.తల్లి మరణిస్తుంది..కడసారి చూపు కూడా దొరకదు.

రాజీనామా చేసి,అలాగే ఆంగ్లేయుల దోపిడి చూసి సహించలేక సమర శంఖం పూరిస్తాడు.దేశంలోని అన్ని ప్రాంతాల సంస్థానాల రాజులను కలుస్తాడు. ఎవరూ ముందుకు రారు..అప్పుడు కత్తి,కర్రసాము నేర్చుకుని ఒక దళాన్ని తయారు చెస్తాడు.హరిజనగిరిజనులను కలిపి సైన్యాన్ని నిర్మిస్తాడు.మరి డబ్బులు ఎలా? 5000 రూపాయలు వుంటే పోఅస్ట్ ఆఫీస్ లను,సమాచార వ్యవస్థను, రైళ్ళను ఆపేస్తాను.ఆంగ్లేయులకు వణకు పుట్టిస్తాను అంటాడు వాసుదేవ్ ఫడ్కే.

కాని డబ్బులు ఎవరిస్తారు? అందుకే ఆంగ్లేయులను సమర్థించే ధనవంతులను దోచుకుని పేదవాళ్ళకు పెట్టాడు.షాహూకార్లనుండి డబ్బులు తీసుకుని స్వరాజ్యం వచ్చిన తరువాత చెల్లిస్తానంటాడు..కరువు కాటకాలతో ప్రజలు చస్తుంటే ఆంగ్లేయులు హింసించే సంఘటనలు సహించడు.ఆంగ్లేయుల ఖజానాను దోచుకున్నాడు.లహుజి వస్తాద్ సాల్వే అను వ్యక్తి ఎస్ సి సామాజీక వర్గానికి చెందినవాడైనప్పటికినీ దేశభక్తిలో బ్రాహ్మణ వర్గానికి చెందిన వాసుదేవ్ ఫడ్కే కి పాఠాలు చెప్పుతాడు.మహదేవ గోబింద రానడే మార్గదర్శిగా వుంటాడు.

అడవుల్లో వుంటూ పల్లెల్లోతిరిగి విప్లవం లేవదీస్తాడు.అడవిలో క్రూర మృగాల బారిన పడతాడు.మంచి నీళ్ళకు కొరత ఏర్పడుతుంది.రోజుల తరబడి కట్టుకున్న ధోవతి కూడా ఉతుక్కోలేని పరిస్థితి. అయినా సంకల్పం వదలడు.ఆంగ్లేయులు వాసుదేవ్ ని సజీవంగా,శవాన్ని గాన్ని పట్టిచ్చిన వారికి పెద్ద మొత్తంలో 4000 రూపాయలు నజరానా ప్రకటిస్తారు. ఇంగ్లిష్ అధికారి సర్ డానియల్ ని చంపినవాడికి 5000 రూ..ఇస్తానని వాసుదేవ్ తిరిగి ప్రకటించడంతో బ్రిటిష్ పార్లమెంట్ లో వణకు పుడుతుంది.

ఆంగ్లేయులు పెద్దసైన్యంతో వేలాది ప్రజలను హింసిస్తారు.హైదరాబాద్ నిజాం రజాకార్లు కూడ ప్రజలను హింసించి వాసుదెవ్ కోసం వెతుకుతారు.కొందరు దేశద్రోహులు ఇచ్చిన సమాచరంతో చివరికి వాసుదేవ్ అరెస్ట్ అవుతాడు.

జైల్లో నుండి వాసుదేవ్ పంత్ ఫడ్కే వీరోచితంగా వూచలు తెగ్గొట్టి పారిపోయి తిరిగి ఆంగ్లేయులకు దొరికిపొతాడు.అరెస్టైన వాసుదేవ్ నిజమైన వాడు అవునా కాదా అని కోర్టులో వాదనలు జరుగుతాయి. వాసుదెవ్ అనుచరుడు రంగో పంత్ గుర్తుపట్టగానే ఆంగ్లేయులు జైల్లో హింసించి చంపేస్తారు.

సద్గురు రాం సింగ్ కూకా భక్తి ఉద్యమమే స్వాతంత్ర్య పోరాటంగా ముందుకురికింది.

13 ఏళ్ళ బాలుడు ఆంగ్లేయులపై సవాల్ విసిరాడు.పంచ ఆబ్ అంటే ఐదు నదులు కలిగిన ప్రాంతం 'పంజాబ్'లో 'భైని ' అనే చోట ఈ బాలుడు కూకా సంప్రదాయానికి,నాంధారి తెగ కు చెంది,సద్గురు రాం సింగ్ శిష్యుడై ఆంగ్లేయులకు పట్టు బడతాడు. ఆంగ్లేయ అధికారి కేవెన్ ' కూకాల గురువు రాం సింగ్ ను తిడతాడు.అది భరించలెని ఆ బాలుడు ఆ అధికారి గడ్డం పట్టుకుని లాగి క్రింద పడేస్తాడు.వెంటనే అంగ్లేయులు ఆ బాలున్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు.అ బాలున్నే కాదు కూకాలుగా పేరుపొందిన 49 మందిని ఇలాగే నరికేస్తారు.

వాసుదేవ్ బలవంత్ ఫడ్కే తరువాత 17 జనవరి 1872 న సద్గురు రాంసింగ్ కూకా వేలాది తన భక్తులను స్వాతంత్ర్య పోరాటానికి సన్నద్ధం చేస్తాడు.కూకా సంప్రదాయ చిహ్నమైన "ఆవు"లను ముస్లిములు,ఆంగ్లేయులు చాలా క్రూరంగా నరికెస్తుంటే, భక్తులు గురువు వద్దకు వెళ్ళి స్వధర్మాన్ని రక్షించుకోవాలంటే అంగ్లేయులను ఈ గడ్డపై నుండి తరిమి వేయవలసిందేనంటూ మొరపెట్టుకుంటారు.అప్పుడు సద్గురు వేలాది మంది మందితో ఆంగ్లేయులపై యుద్ధం చేస్తారు.

ఆ యుద్ధంలో కుకాలు హేనంగా చంపివేయబడతారు.రాంసింగ్ ని అరెస్ట్ చేసి,బ్రహ్మదేశానికి పంపివేస్తారు..

విష్ణుశాస్త్రి కృష్ణశాస్త్రి చిప్లుంకర్ (29 మే 1850-17 మార్చ్ 1882)..

ఆంగ్లేయులు ఈ దేశం పై పట్టు సాధించడానికి, తమ చెప్పు చేతల్లో వుండే వ్యక్తులను శాశ్వతంగా మానసికంగా బానిసలుగా వుంచుకోవడం కోసం ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు..దాన్ని అభ్యసించిన కొందరు మహానుభావులే కొద్దిరోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళను దేవతలుగా అభివర్ణించటం మొదలు పెట్టారు.బ్రిటిష్ వళ్ళు ఇక్కడ వుండటం వల్లనె ఆధునికత అలవడుతుందని గట్టిగా విశ్వసించే మేధావులు తయారయ్యారు. విష్ణుశాస్త్రి ఇది గమనించి పూణే లో బ్రిటిష్ వాళ్ళు నడిపే ఇంగ్లిష్ స్కూళ్ళకు పోటీగా దేశభక్తి ని నేర్పే ఇంగ్లిష్ స్కూల్ ని ప్రారంభించారు.బాల గంగాధర్ తిలక్ తో కలిసి "కేసరి" పత్రిక ను నడిపారు. అలాగే 'కావ్యేతిహాసా అను పత్రికను నడిపారు.రెండు ప్రింటింగ్ ప్రెస్సులను మొదలుపెట్టాడు.ప్రజలందరికి చరిత్ర పుస్తకాలు అందుబాటులో వుండే విధంగా ఒక బుక్ స్టాల్ ను నడిపించారు.

పాశ్చాత్య జీవన విధానం మన స్వాతంత్ర్య పోరాటానికి ఎలా ఆటంకంగా మారుతున్నదో, దిన పత్రికల్లో వ్యాసాలు వ్రాస్తుండే వారు.

విష్ణుశాస్త్రి సంస్కృతం మరియు ఇంగ్లిష్ భాషల్లో పండితుడై,తన రచనల ద్వార భారత స్వాతత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర ను పోషించాడు.

చాపేకర్ సోదరులు (1878-1899)

పూనాలోని బ్రాహ్మణ యువకులందరిని కాల్చివేయాలని మహారాష్ట్రాలోని ఇంగ్లిష్ పత్రిక ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.కారణమేమిటంటే ముగ్గురు అన్నదమ్ములు దామోదర్,బాలక్రిష్ణ,వాసుదేవ్ చాపేకర్ సోదరులు వాళ్ళ నాన్న శ్రీ హరిపంత్ వూరూరా కీర్తనలు పాడుతుంటే వెనక వంత పాడే గాయకులుగా వెళ్ళే ఈ సోదరులు,దేశంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించి ప్రజలు చస్తుంటే ఆంగ్లేయ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా,మరింత హింసకు గురిచేస్తుంది సహించలేక, విప్లవ కారులయ్యారు.

దామోదర్(27 సం..వయస్సు),ఆంగ్లేయ అధికారి రాండ్ ని, బాలక్రిష్ణ*23సం.. వయస్సు), ఇంగ్లిష్ అధికారి అయరెస్ట్ ని కాల్చి చంపేస్తారు..చిన్న తమ్ముడు వాసుదేవ్(20సం.వయస్సు.), ఇంగ్లిష్ వాల్లకు సమాచారమిచ్చే ఒక దేశద్రోహిని చంపేస్తాడు.

ఈ మూడు సంఘటనలు ఆంగ్లేయులను వణకు పుట్టిస్తాయి.

ఈ చాపేకర్ సోదరులకు బాలగంగాధర్ తిలక్ గురువు..దామోదర్ చాపేకర్ బ్రిటిష్ వాళ్ళకు ఒక వినతిపత్రమిచ్చి తనను సైన్యంలో చేర్చుకొమ్మంటాడు.400 మంది బ్రాహ్మణ యువకుల బెటాలియన్ ని సమకూరుస్తానంటాడు..అయితే ఈ పూనా బ్రహ్మణ యువకులు సామాన్యులు కాదని తెలిసి,తిరస్కరిస్తారు.దామోదర్ ఒక వ్యాయామ శాల మొదలు పెట్టి, యువకులను పోరాటానికి సన్నద్దం చేస్తాడు. ఆంగ్లేయుల్ను కాల్చి వేసిన తరువాత వీరిని పట్టుకోవడానికి 20000 రూ..నజరానా ప్రబుత్వం ప్రకటిస్తుంది. చాల రోజుల తరువాత పట్టుబడి,విచారణ జరిపి,ప్రభుత్వం వీళ్ళను ఉరి తీస్తుంది.

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ (23 జులై 1856 – 1 ఆగస్ట్ 1920),

ఆంగ్లేయుడు హ్యూం " కాంగ్రెస్"ని ఒక దరఖాస్తుల సంస్థగా వుంచి,దేశాన్ని బలహీనంగా మార్చాలని ప్రారంభించాడు.కాని తిలక్ దాన్ని ఉత్తమ జాతీయ ఉద్యమ సంస్థగా తీర్చి దిద్దాడు.

*జాతీయవాది,ఉపాధ్యాయుడు,సామాజిక సంస్కర్త,జర్నలిస్ట్,లాయర్,స్వతంత్ర సమర యోధుడు...

*స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రప్రథముడు. "భారత్ లో అశాంతి కి తండ్రి" యని ఇంగ్లిష్ వాళ్ళు పిలిచారు.

*స్వపరిపాలన,స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించిన వీరుడు.

*23 జులై 1856 లొ జననం, .1871 వివాహం,1877 లో డిగ్రీ పూర్తి,1879 లా పూర్తి,తరువాత పూనా స్కూల్లో గణిత ఉపాధ్యాయుడు.

*ప్రపంచాన్ని కుటుంబంగా భావించి మానవాళికి సేవచేయమన్నాడు.స్వార్థం వద్దన్నాడు.

*ప్లేగ్ వ్యాధితో భారతీయులు చచ్చిపోతుంటే,ఆంగ్లేయుల ఆగడాలు మితిమీరిపోతుంటే'కేసరి మరియు 'మరాఠా' పత్రికల ద్వారా తీవ్రపదజాలంతో దుమ్మెత్తిపోశాడు..ఇవి చదివిన ఇద్దరు చాపేకర్ సోదరులు, ఇద్దరు ఆంగ్లేయ అధికారులను కాల్చి చంపేశారు.

*తిలక్ వ్రాతలకు భయపడ్డ ప్రభుత్వం తిలక్ ని అరెస్ట్ చేసి,18 నెలలు జైల్లో వుంచింది.

*జాతీయ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన ప్రకటించినప్పుడు,తిలక్ స్వదేశీ ఉద్యమం ' నడిపి విభజన జరగకుండా చేశాడు.

*అలాగే గణపతి ఉత్సవాలను,శివాజీ జయంతి ఉత్సవాలను జాతీయ ఉద్యమానికి ప్రేరణగా ప్రజల్లో రూపొందించి నడిపించాడు.

*ఆ పండుగల్లో ఉపన్యాసకులుగా బిపిన్ చంద్ర పాల్,లాలా లజపత్ రాయ్,చాపేకర్ సోదరులను పిలిచి ప్రజలను ఉత్తేజితులను చేశాడు.

*డగ్లస్ కింగ్స్ ఫొర్డ్ అనే అధికారిపై ప్రఫుల్ల చాకీ,ఖుదీరాం బోస్ లు బాంబులు విసిరితే,ఇద్దరు మహిళలు చనిపోయారు.ఆంగ్లేయులు వారిని అరెస్ట్ చేస్తే, తిలక్ పత్రిక కేసరి లో ఆ విప్లవ వీరులను సమర్థిస్తూ వ్యాసం వ్రాశాడు. దానికి ఆంగ్లేయులు తిలక్ ను అరెస్ట్ చేశారు.తన కలం వల్ల బాధపడే వారి కంటే లాభం పొందే వారే ఎక్కువని కోర్టులొ తన వాదనగా వినిపిస్తాడు.1908 నుండి 1914 వరకు మాండలే జైల్లో వుంచారు.ఆ జైల్లోనే 'గీతా రహస్యం' అను భగవద్గీత పై వ్యాఖ్యానం వ్రాస్తాడు.

*విడుదల అయిన తరువాత వూరూరా తిరిగి హోం రూల్ లీగ్ లో సుమారు 32 వేలమందిని చేర్పించి స్వరాజ్య ఉద్యమాన్ని నడిపిస్తాడు.

*స్వామి వివేకానంద చికాగో కు వెళ్ళక ముందు 1892 లొ తిలక్ ఇంట్లో కొద్ది రోజులు నివసిస్తాడు.

*తిలక్ బ్రతికి వున్నప్పుడు,ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తి దాతనే..

*ఆయన మాటలు,వ్రాతలు,నడక,ఆలోచనలు దేశభక్తులందరికీ ప్రేరణను ఇస్తూనే వుంటాయి.

- అప్పాల ప్రసాద్. 

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (1857-1947 Freedom Fighters)...

    ReplyDelete