Breaking News

1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (First War of Independence)


ప్రపంచంలో జరిగిన మహా యుద్ధాల్లో 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటం ఒకటి.

కాంగ్రెస్ పదవీ రాజకీయాలు,కమ్యూనిస్టు మేధావుల దేశద్రోహ విధానాలు దేశ ప్రగతికి ఆటంకంగా మారాయి..అవి ఇంకా భారతీయులను పనికిరాని వారిగా చిత్రీకరిస్తున్నాయి.

ఆ 1857 మహా యుద్ధాన్ని, అమరులైన మన భారతీయ వీరులను గుర్తుకు తెచ్చుకోకుండా చేసింది కమ్యునిస్టు భావజాలాలకు చెందిన చరిత్ర కారులు.వారిలో ఒకరు మజుందార్. ఈ సూడో చరిత్రకారుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి,చరిత్రను తప్పు దారి పట్టించాడు.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సూడొ సెక్యులర్ వేశాలు వేస్తూ వచ్చింది..ఈ కాంగ్రెస్,కమ్యునిస్ట్ ల వల్ల కోట్లాది భారతీయులకు లభించవలసిన నిజమైన అంశాలు కోల్పోయింది.మజుందార్ నిజాలను తొక్కిపెట్టాడు.1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తించలేదు.అది కేవలం సిపాయిల తిరుగుబాటు అన్నాడు. కాని ఈ యుద్ధాన్ని స్వయంగా చూసిన ఇంగ్లండ్ కి చెందిన జస్టిస్ మెకర్తి ఇలా అంటాడు." ఇంగ్లిష్ వారి అధికారానికి వ్యతిరేకంగా హిందువులు,ముస్లిములు ఎలాంటి భేదాలు లేకుండా సైనికులే కాదు సామాన్య ప్రజలతో సహా సాగిన మహా ఉద్యమమిది.చార్లెస్ బౌల్ అంటాడు కదా"ఈ యుద్ధం అద్భుతమైనది.సైనికులకు మద్దతుగా ప్రజలంతా రంగంలోకి దిగారు.సహాయం అందించారు.అన్నం పెట్టారు..స్వయంగా పాల్గొన్నారు.వాళ్ళ సామాన్లకు రక్షణగా వున్నారు.సమాచారాన్ని అందించారు.గూఢచర్యం వహించారు. ఆంగ్లేయుల అణిచివేతకు,దోపిడికి,బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా జరిగిన మహా పోరాటం ఇది.... బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చిన నెపాల్ రాజు, ప్రథమ స్వాతంత్ర్య పోరాటంసిపాయి నానా సాహెబ్ పీష్వాను అంగ్లేయులకు లొంగిపొమ్మని సలహా ఇస్తాడు..దానికి ఈ భూమి పుత్రులమైన మమ్మల్ని దోపిడిదొరలకు లొంగిపొమ్మని చెపుతారా అని నానా సాహెబ్ పీష్వాప్రశ్నిస్తాడు.స్వధర్మం కోసం, స్వరాజ్యం కోసం సాగుతున్న మహా సంగ్రామం ఇదని పేర్కొంటూ ఉత్తరం వ్రాస్తాడు.
-అప్పాల ప్రసాద్. 

1 comment:

  1. 1857 - 1947--స్వాతంత్ర్య సమర యోధులు (First War of Independence).

    ReplyDelete