Breaking News

వేదకాలం నుండి కూడా మన స్త్రీలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో అర్థం చేసుకోవాలి


వేదాన్ని 'వేద మాత ' అని , భూమిని 'భూమాతా' అని , జగత్తును 'జగన్మాతా ' అని పిలిచే సంస్కృతి మనది.పాశ్చాత్య్ దేశాలకు 'పితృభూములున్నాయి కాని మాతృభూములు లేవు. మన మాతృభావనకు ' కుటుంబవ్యవస్థ ' ఆధారం. ఆ కుటుంబంలో స్త్రీ కి అపూర్వ స్థానం ఇవ్వబడింది.పురుషుడు స్త్రీని అనుసరించాలని పెద్దలు చెప్పారు.మనుస్మృతి లోని కొన్నింటిని ఈ యుగానికి పనికిరానివి తీసివేస్తే,స్త్రీ విషయంలొ మాత్రం 'స్త్రీలకు గౌరవం లభించేచోట దేవతలు ఆనందిస్తారు అని స్మృతి చెప్పింది.స్త్రీలు ఏడుస్తున్న చోట వంశం నాశనమవుతుంది అని కూడా చెప్పింది.స్త్రీలు తమను తాము రక్షించుకోవాలని కూడా చెప్పింది.

విస్పశ ...ఈమె ఖేలుడు అనే వీరుడి భార్య.ఆమె కూడా యుద్ధంలో వీరోచితంగా పోరాడినప్పుడు ఆమె పాదం తెగిపొయింది.అప్పుడామె ఇనుపకాలు అమర్చుకుని యుద్ధానికి వెళ్ళింది. ఋగ్వేద సం హిత ఈ విషయం పేర్కొన్నది.

వధ్రి మతి.. అనే స్త్రీ కి సంతానం లేకపొతే అశ్వినిదేవతలు మరొక వివాహం చేసి, సంతానవతి అయ్యేట్లు చేసారు.

గార్గి... అనే స్త్రీ గొప్ప వేదాంత వేత్త అయిన జనక మహారాజు ఆస్థానంలో పండితుల సభలో యాజ్ఞ వల్క్యుడితో మాట్లాడి అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. ఈమె వచక్నుడి పుత్రిక..

మైత్రేయి.. యాజ్ఞ్యవల్కుని భార్య ఈమె.. మరొక భార్య కాత్యాయిని. సంపాదించిన ఆస్తి వీరిద్దరికి పంచాలని భావించినప్పుడు,, ఈ భూమి వల్ల నాకు అమరత్వం లభించదు కదా? అలాంటప్పుడు తనకు ఈ భౌతిక ఆస్తి ఎందుకని ఆస్తిని తిరస్కరిస్తుంది.

కాత్యాయని...ఈమె భౌతిక ఆస్తిని స్వీకరించి,తన చుట్టూ వున్నవారికి తిండి,బట్ట,గృహ వసతి కల్పిస్తుంది.

సులభ...ఈమె యోగ శక్తిని సాదించింది. జనక మహారాజుతోనే వాదులాడింది. 'నీ అందంతో అందరిని ఆకర్శించాలని వచ్చినట్లున్నావని ' ఆమెతొ జనకుడు అన్నప్పుడు, ఆమె ' నీవు మంచి పండితుడవని తెలిసి నీ దగ్గర్కివచ్చి జ్ఞాన చర్చ చేద్దామని అనుకుంటీ ' నీ మాటలు విన్న తరువాత నీవు ఒట్టి కుండ వని అర్థమయ్యిందని ' సులభ పలుకుతుంది.

ఇంద్రస్నుశ..ఇంద్రాణి..అదితి..సూర్య..సావిత్రి..యమి..వైవస్యతి.శచి.పౌలోమ..అపల..ఆత్రేయి.శాశ్వతి,జుహు,గోధా.రోమశ,లోపాముద్ర,విశ్వవర, ఊర్వశి,కాశ్యపి,శరమ..మేధ..ఈ పేర్లు ఒక ఋగ్వేదంలోనె వున్నయి..జబాల..చూడాల..పృధ్వి..ఇలసరస్వతి...భారతీ..సినీవాలీ..రాఖ..సూనృత..పురంధ్రి..ధిషణ..అనుమతి..తిరిణి..ఇంద్రాణి..ఉషస్సు..శ్రద్ధ..అరామతి..దంపతి..అరణ్యాని..వరుణాని...ఇలా ఈ స్త్రీలందరూ బాగ చదివిన పండితులే.

వేదకాలం నుండి కూడా మన హిందువులు..స్త్రీలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో. అర్థం చేసుకోవాలి..
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. వేదకాలం నుండి కూడా మన స్త్రీలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో అర్థం చేసుకోవాలి

    ReplyDelete