మహిళలకు స్వేచ్చ అంతంత మాత్రమేనా?
మహిళల హోదా,హక్కులు,సమానత్వం గురించి ప్రపంచమంతటా చర్చలు,పోరాటాలు,హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భాలు చరిత్రలో కనబడతాయి.కాకపొతే ఇవన్నీ అమెరికా,ఇంగ్లాండ్ మొదలైన పాశ్చాత్య దేశాల్లో చోటుచేసుకున్నాయి.
అమెరికా మహిళకు వోటింగ్ హక్కులు 1920 తర్వాతనే వచ్చాయి.
బ్రిటన్ మహిళకు సమాన వోటింగ్ హక్కులు 1928 తర్వాతనే వచ్చాయి.
స్విట్జర్లాండ్ లొ 1971 వరకు కూడా రానే లేదు..ఎందుకంటే ఆ దేశంలోని మెజారిటీ పురుషులు మహిళలకు హక్కులు ఇవ్వవద్దని 1959లో అభిప్రాయపడ్డారు.
ఈ దేశాల్లో నిరంతర పోరాటాల ద్వారానే ఈ మాత్రం సాధ్యమయ్యాయి.గమ్మత్తేమిటంటే,ఇప్పటికీ రోమన్ క్రిస్టియన్ వాటికన్ సిటీ లో మహిళలకు ప్రాధాన్యత లేదు.
ఈ దేశాల్లో మహిళలపై విధించిన కఠిన నిబంధనల కారణంగానే, మహిళలు 'ఫెమినిజం ' వైపు ఆకర్శించబడి, విశృంఖల స్వేచ్చ కోసం పరుగులు తీసారు..దాంతో వ్యక్తిగత,నైతిక విలువలు,సామాజిక కట్టుబాట్లకు,నియమాలకు భంగం వాటిల్లింది.
ఈ దేశాల్లో ఇలాంటి స్థితి వుంటే భారతీయ మహిళలను కూడా 'ఫెమినిజం ' వైపు లాక్కుని పోయి,కుటుంబాలను నాశనం చేసే వార్తలు,వ్యాసాలు వ్రాసే అబద్ధపు మేధావులను ఏమనాలి?
- అప్పాల ప్రసాద్
మహిళలకు స్వేచ్చ అంతంత మాత్రమేనా?
ReplyDelete