Breaking News

భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-4


శచీదేవి..ఇంద్రుని భార్య..కూతురు జయంతిని,కొడుకు జయంతున్ని చక్కగా పెంచింది. భర్తకు యుద్ధంలో సహకరించింది.మచ్చలేని మనిషి ..
వేదవతి... మాలావతి,కృషధ్వజుల కుమార్తె.వేదాలు అధ్యయనం చేస్తుంది.విష్ణువుని పెళ్ళాడాలనుకుంటుంది.రాక్షసులు ఆమె వెంటపడుతారు.ఆమె అగ్నిలో దూకి,మ ళ్ళీ పుట్టి,జనకునికి పొలం దున్నే సమయం లొ దొరుకుతుంది.ఆమెనే సీత. విష్ణువు అవతారం రామున్ని వివాహమాడుతుంది.అనుకున్నది సాధిస్తుంది.
అనసూయ..ఎవరి మీద అసూయ లేనిది..భర్త అయిన అత్రి మునికి సేవచేస్తూ..ఒక రోజు త్రిమూర్తులు ఆమెను పరీక్షించడానికి వచ్చినప్పుడు..వాళ్ళను పసిపిల్లలు గా మార్చి,వడ్డిస్తుంది. దీనజనులకు సేవచేసింది..కరువు వచ్చినప్పుడు తపస్సు చేసి భూమిని సస్యశ్యామలం చేసింది.
రేణుక..జానపదుల ఎల్లమ్మే రేణుక..జమదగ్ని భార్య..పరశురాముని తల్లి. ఆమె గంధర్వ రాజుని చూసి మానసికంగా విచలిత అయింది..ఆ నిజాన్ని దాచకుండా భర్తకు చెబుతుంది.పరశురాముడు తండ్రి ఆదేశంతో తల్లి తలను నరికి,మళ్ళీ తల్లిని బ్రతికించుకుంటాడు.
చంద్రమతి...హరిశ్చంద్రుని భార్య..తన కుటుంబం కష్టాల పాలైనప్పుడు,చెదిరిపోకుండా భర్తకు అండగా నిలుస్తుంది.సీత,ద్రౌపది కూడా ఈమెను అనుసరిస్తారు.
లక్ష్మి..పార్వతి..సరస్వతి..ఈ ముగ్గురు శక్తిస్వరూపిణులుగా మిగతా స్త్రీలకు ప్రేరణగా పూజలందుకుంటున్నారు.
ఈ మహిళలు స్వేచ్చాప్రియులు. సత్యసంధులు.. అన్యాయాన్ని ఎదిరించేవారు.పురుషునితో పాటు సమానంగా వ్యవహరించారు.జఢుడైన పురుషునికి చైతన్యం అందించారు.
అదితి..అడుగడుగునా ఎదురుదెబ్బలు తగిలినా,తపస్సు చేసి,వామనుణ్ణి కని,బలి చక్రవర్తి నుండి స్వర్గాన్ని,ఇంద్రునికి ఇప్పించటంలో ప్రధాన పాత్ర పోషించింది.
దేవహుతి...తొలి మానవ దంపతులైన స్వాయంభు మనువు..శతరూపల పుత్రిక ఈమె. ఈమె కడుపున కపిలాచార్యుడు పుడతాడు.సాంఖ్యశాస్త్ర విశేషాలను లోకానికి తెలుపుతాడు..బీజం,సూక్ష్మం,గుణత్రయం,ప్రకృతి,వాసనలు,ప్రాణాధారం...ఇలా ఎన్నో అంశాలు బోధించాడు కపిలుడు..
దేవకి..కృష్ణుని తల్లి.సహన శీలి,ఆశావాది.భర్తతో పాటు 30సంవత్సరాలు జైళ్ళో వుండి,లోకరక్షకున్ని కృష్ణున్ని కన్నది.
యశోద...తన లాలనలో కృష్ణ లీలలు ప్రత్యక్షంగా చూసి పులకరించిపోయింది.విశ్వవ్యాపి అవుతున్న కృష్ణుణ్ణి ఆడించి ధన్యత పొందింది.
కుబ్జ..మధురలో పూలమ్మే ఒక మూడు వంకరలుగా తిరిగిన వికలాంగ కురూపి.. అయిన్న భక్తురాలు..కృష్ణుడు ఆమెను కరుణించి,ఆమెకు సుందర రూపం కల్పించాడు.దేవుడికొసం పూలు అల్లి,దేవకాయంలో వున్న అతి సామాన్య కుటుంబంలో పుట్టిన ఈమెకు కూడా మన శాస్త్రం సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది.
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం-4

    ReplyDelete