చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా
' చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా' అని ప్రశ్నిస్తాడు శ్రీ దత్తొపంత్ ఠేంగ్డీజీ.
గాంధీజీ స్వాతంత్ర్యం కోసం పోరాడి,ఆ తరువాత తన కలలు పేక మేడలా కూలిపోతుంటే,తన దేశ పాలకులే తన మాట వినని పరిస్థితి వచ్చినప్పుడు కన్నీరు కార్చాడు.
జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ విప్లవం కోసం ఉద్యమం చేసి 'జనతా పార్టీ ' ఏర్పాటు చేసిన తరువాత, తన కలలకు భిన్నంగా పరస్పరం కొట్లాడుకుంటుంటే చాలా బాధపడ్డాడు.
బాబా సాహెబ్ అంబేద్కర్ దళితుల హక్కుల కోసం పోరాడి,స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అంటరానితనం,ఆర్థిక అసమానతలు తగ్గక పోవటం చూసి విలపించాడు.
వీళ్ళంతా నైతిక బలం కలిగిన గొప్ప వ్యక్తులే.కాని దేశభక్తి కలిగిన, క్రమశిక్షణ కలిగిన ప్రజా బలం వీళ్ళ వెనక లేని కారణంగా,వారి విధానాలు అమలుపరిచే స్థాయిని కోల్పోయాయి.
ఎందుకంటే అవి లేని కారణంగానే కదా,మొఘలులు, ఆంగ్లేయులు మనను ఓడించింది..
' చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా' అని ప్రశ్నిస్తాడు శ్రీ దత్తొపంత్ ఠేంగ్డీజీ.
- అప్పాల ప్రసాద్.
చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా.??
ReplyDelete