మన " భారతీయ ధర్మం " ప్రపంచానికే తలమానికం
ఆకలితో వున్న ఒక కుక్క ,ఒక సాధువుకు బిక్షగా పెట్టిన రొట్టెముక్కను ఎత్తుకుపోతుంటే,దాన్ని వెంబడిస్తూ తినడానికి నెయ్యిని కూడా అందించాలని తాపత్రయపడ్డ 'నామదేవుడు ' అందరికి అనుసరణీయుడు.
దప్పికతో వుండి క్రిందపడి కొట్టుకుంటున్న ఒక గాడిదకు,రామేశ్వరంలోని శివలింగం పై పోద్దామని, కాశీ నుండి తెచ్చిన గంగా జలాన్ని అందించిన ' ఏకనాథుడు ' ఆదర్శప్రాయుడు.
బురద గుంటలో ఇరుక్కుపోయి పైకి రాలేక, అరుస్తున్న ఒక చిన్న పందిపిల్లను,అమెరికా అధ్యక్షుడిగా వుంటూనే,తన దుస్తులకు మరకలు అంటుతాయని కూడా ఆలోచించకుండా బురదలో దిగి,పందిపిల్లను రక్షించిన అబ్రహం లింకన్ సంఘటన అందరికి ఒక కనువిప్పు.
తన సుఖం కంటే ఇతర ప్రాణుల క్షేమమే సత్యమని నమ్మటమే 'ధర్మం ' అంటారని, అటువంటి ధర్మ ఉదాహరణలు పాశ్చాత్య దేశాల్లొ కంటే మన దేశం లోనె వేలాదిగా కనిపిస్తాయని అంటారు శ్రీ దత్తొపంత్ ఠేంగ్డీజీ.
అందుకే మన " భారతీయ ధర్మం " ప్రపంచానికే తలమానికం .
అంతే కాదు ప్రపంచానికి మనమిచ్చిన 'ధర్మం' అనే పదానికి ప్రపంచంలోని ఏ భాషల్లో కూడా అనువాదం లేదు.
- అప్పాల ప్రసాద్
మన " భారతీయ ధర్మం " ప్రపంచానికే తలమానికం.
ReplyDelete