భారతీయ జీవన మూల్యాల పరిరక్షణకు నడుంకట్టవలసిన సమయం ఆసన్నమైంది
దత్తోపంత్ ఠెంగ్డీజీ అభిప్రాయమేమిటంటే..
ఆ భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధాన మూల్యాలకు అడ్డంకులు ఏర్పడినప్పుడు,కొందరు వ్యక్తులు ఆ మూల్యాలను లేకుండా చేస్తున్నప్పుడు,అహంకారంతో సమాజ విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు,రాముడు పుట్టి రావణున్ని వధించాడు.కృష్ణుడు జన్మించి కంసుణ్ణి,కౌరవులను లేకుండా చేసాడు.శివాజి,రాణా ప్రతాప్,గురుగోవింద సింగ్ లు పుట్టి మొఘలులను ఓడించారు.తిలక్,నేతాజి,గాంధిజి మొదలైన స్వాతంత్ర్య సమర యోధులు ఆంగ్లేయులను ఎదిరించి పారద్రోలారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జీవన మూల్యాలకు భంగం ఏర్పడినప్పుడు,చూస్తూ కూర్చున్న కారణంగా,భయపడి బలహీనంగా వున్నందువల్ల,మన విలువలను అపహాస్యం చేసే వారితో రాజీ పడిపోయినందు వల్ల, మన దేశం ముక్కలైంది.ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ ముక్కలై విడిపోయాయి.లక్షలాది ప్రాణాలు గాలిలో కలిసిపొయినా పట్టించుకోలేదు.ఆగ్లేయుల కుటిలనీతికి ఎదురు చెప్పలేని బలహీంత ఆవరించింది.అందువల్ల నేపాల్,మయన్మార్,శ్రీలంక,టిబెట్ దూరమయి పోయాయి.కాశ్మీర్ మంట ఇంకా రగులుతుంది.దొంగ చాటుగా 1962 లో చైనా మనను దెబ్బకొట్టి,మన భూమిని ఆక్రమించుకున్న దుస్సంఘటనలు,వేలాది సైనికుల ప్రాణార్పనలు ఇంకా గుర్తుకు వస్తున్నాయి.దుష్ట,స్వార్థ రాజకీయ పార్టీల నాయకులు మన సనాతన జీవన మూల్యాలను శత్రువులకు ఫణంగా పెడుతున్నారు.పదవీ కాంక్షతో మన జీవన విలువలను ప్రపంచ మార్కెట్లో అమ్ముతున్నారు.వొటర్ లిస్ట్ లో పేర్లున్నా,రేషన్ కార్డులు,పాన్ కార్డులు,ఆధార్ కార్డులున్నా స్వార్థం తప్ప,ప్రజలు,సమాజం,దేశం,భారతీయ విలువలు ఏమవుతున్నాయో అన్న స్పృహ లేని జనాభా పెరిగిపోతుంది.మంద,గుంపు వలె జీవించడం తప్ప త్యాగం,సేవ,ప్రేమ,కరుణ,దయ,దేశభక్తి,క్రమశిక్షణ లేని యువకుల సంఖ్య కోట్లాదిగా పెరిగిపోతుంది.
అందుకే మళ్ళీ భారతీయ జీవన మూల్యాల పరిరక్షణకు నడుంకట్టవలసిన సమయం ఆసన్నమైంది.
- అప్పాల ప్రసాద్
భారతీయ జీవన మూల్యాల పరిరక్షణకు నడుంకట్టవలసిన సమయం ఆసన్నమైంది.
ReplyDeleteHe is also founder of BMS.
ReplyDeleteyes. exactly.
Delete