కరెంటు కష్టాలు తెలియని గ్రామం-భారత్ వెలిగిపోతుంది
ప్రస్తుతం మన దేశంలో కరెంటు కష్టాలు లేని గ్రామం ఏదైనా ఉందా అంటే, "అన్ని గ్రామాలకు తప్పని కరెంటు కష్టాలు, గ్రామాల సంగతి ఎందుకు పట్టణాలకు అదే పరిస్థితి". కాని, ఇప్పటి నుంచి ఆ సమాధానం రాకూడదు. ఎందుకంటే అస్సలు కరెంటు కోతలు తెలియని గ్రామం ఒకటి ఉందండోయ్. ఆ గ్రామం పేరు " ధర్నై(DHARNAI)", బీహారు రాష్ట్రం లోనిది.
30 ఏళ్ళ పాటు చీకటిలో గడిపిన ఆ గ్రామం. సాయంత్రం 6 అయితే చీకటి ప్రపంచం అక్కడ. అలాంటిది నేడు ఉదయానికి, రాత్రికి తేడ లేకుండా అయిపొయింది. తమకుతామే ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టుకొని భారతదేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్ర్రీన్ పిస్ అనే ఒక స్వచ్చంద సంస్థ వారి సహాయంతో 100KV మైక్రో పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకొని 500 ఇళ్ళకు, 50 వ్యాపార సంస్థలకు, 60 వీధి దీపాలకు, 2 స్కూళ్ళకు, 1 ఆసుపత్రికి ప్రభుత్వ సహాయం లేకుండా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుని వాడుకుంటున్నారు. ఇవే కాకుండ వ్యవసాయ మొటారులు, నీటి కొలాయిలకు ఆ విద్యుత్ నే ఉపయోగిస్తున్నారు. కేవలం ఎండవేడి తోనే తమకు కావాల్సినంత కరెంటు పండించుకొని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రింద ఇచ్చిన ఫోటోలను చుడండి.
ఇప్పుడు ఈ గ్రామం- సర్వ స్వతంత్ర సౌర విద్యుత్ గ్రామం (The First and Fully Solar Powered Village). ఇటువంటి గ్రామాలను రాబోయే కాలంలో ఎన్నో చూడాలని ఆశిస్తూ.
- సాయినాథ్ రెడ్డి.
మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.
ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటివి అమలు చేస్తే బాగుంటుంది.
ReplyDeleteప్రభుత్వం చొరవ తీసుకుంటే అస్సలు కరెంటు కోతలే ఉండవు.
Delete24 గంటలు కరెంటు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయ్.
ఆదర్శ గ్రామం. మంచి వ్యాసం.
ReplyDeleteనిజంగానే ఆదర్శ గ్రామం. మన రాష్ట్రంలో ఎప్పుడు చూస్తామో.
ReplyDeleteInformative Post
ReplyDeletethanks for visiting shiva garu..
DeleteInspiring village
ReplyDeleteprabutvam kaakunda manaku mane mana intlo solar plates nu amarchukovali.
ReplyDeleteకరెక్ట్ గా చెప్పావు కుమార్.
Delete