త్యాగం ఎంత గొప్పదో ఆలోచించండి
1. ఈ రోజుల్లో కూడా కుష్టు రోగులకు సేవ చేస్తున్నవాళ్ళు లేరా?
2.మందులను కనిపెట్టి,వాటిని తమ శరీరాలపై ప్రయోగించుకున్న శాస్త్రవేత్తలు లేరా?
3.మానవుడి కష్టాలను చూసి,కరుణ ఉప్పొంగి,బుద్ధుదైన సిద్ధార్థుడి గురించి మనం వినలేదా?
4.గంటల తరబడి రాళ్ళను చెక్కుతూ ఆకలి దప్పులను మరిచిన మరిచిన్ కళాకారులను మనం చూడటం లేదా?
5.స్నానం చేస్తూనే ఏదో అలొచన మెదడులో రాగానే,కనుక్కున్నాను..కనుక్కున్నాను అంటూ నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తిన ఆర్కిమెడిస్ అనే సైంటిస్ట్ కథ నీకు తెలియదా?
6.బురద గుంటల్లో ఇరుక్కుపోయిన వారిని, తమ ప్రాణాలు లెక్క చేయకుండా కాపాడబొయి అసువులు బాసిన వారు ఎందరు లేరు?
7.రాక్షసులను చంపడానికి తన వెన్నెముకను దేవతలకు దానమిచ్చిన్ 'దధీచి ' కథ చదివారా ?
8.పావురాన్ని కాపాడడానికి డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన సంఘటన విన్నారా?
9." ఓ తల్లీ ! నీ వైభవం నిరంతరం నిలిచి వుండాలని,అందుకు మేము నాలుగు రోజులు మాత్రమే బ్రతికినా ఫరవాలేదని ఉరికంబాలెక్కిన మన భగత్ సింగ్ ,రాజ్ గురు వంటి 7లక్షల 30 వేల భారతీయ వీరుల గాథలు అబద్ధాలు కాదు కదా?
వీళ్ళందరూ తమ శరీర భౌతిక సుఖాలను కాదని ఇతరుల క్షేమం తోనే మాకు సుఖం లభిస్తుందని చేసిన 'త్యాగం' ఎంత గొప్పదో అలోచించండి అంటాడు శ్రీ దత్తోపంత్ ఠేంగ్డీజీ.
- అప్పాల ప్రసాద్.
త్యాగం ఎంత గొప్పదో ఆలోచించండి
ReplyDelete