Breaking News

పంచాయితీలలో సిటిజన్స్ చార్టర్స్


ఈ క్రింది పౌరసేవలను సిటిజన్స్ చార్టర్స్ ద్వారా అందించాలి.

పౌర కార్యక్రమము
కాలపరిమితి
1. స్వగ్రామ ధృవీకరణ పత్రము జారీ 
2 రోజులు
2. నివాస ధృవీకరణ పత్రము జారీ
2 రోజులు
3. కుల ధృవీకరణ పత్రము జారీ చేయుటకు సమర్దాధికారికి సిఫారసు
2 రోజులు
4. ఆదాయ ధృవీకరణ పత్రము జారీ చేయుటకు సమర్దాధికారికి సిఫారసు
2 రోజులు
5. జనన మరణ ధృవీకరణ పత్రముల జారీ ప్రభుత్వ ఉత్తర్వు నెం.23 పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి (మం.2) శాఖ, తేది. 13-07-2002 ప్రకారము)
5 రోజులు
6. జనన మరణాల రిజిష్ట్రేషన్
3 రోజులు
7. ఆస్తి పన్ను గణన, ఇంటి నెంబరు కేటాయింపు
15 రోజులు
8. భవన నిర్మాణ ధరఖాస్తులు పరిష్కారము
15 రోజులు
9. నీటి సరఫరా మంజూరు
30 రోజులు
10. సమర్దాధికారికి లేఅవుట్లు సిఫారసు
15 రోజులు
11. ఆస్తి బదలాయింపు (మార్పిడి)
15 రోజులు
12. లైసెన్సుల జారీ
5 రోజులు
13. పహాణి/అడంగల్
2 రోజులు


ఇబ్బందులు తొలగింపు (నివారణ)

పౌర కార్యక్రమము
కాలపరిమితి
1.పైపులైను లీకేజీ మరమ్మత్తులు
24 గంటలు
2. చేతిపంపులు మరమ్మత్తులు
3 రోజులు
3. వీధి దీపములు, పాతబల్బులు/ట్యూబులు బదులు కొత్తవి అమర్చుట
2 రోజులు
4. నిలిచిపోయిన మరుగు కాల్వలు, గుంటలపై ఫిర్యాదు
2 రోజులు
5. రోడ్డు కోతలు, గుంతలు ఫిర్యాదులు
3 రోజులు
6. చెత్తకుండిల శుభ్రత గురించిన ఫిర్యాదులు
2 రోజులు
7. పంచాయతీ, ప్రభుత్వానికీ సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు వివరములతో సమాచారము
5 రోజులు

ఈ సమాచారాన్ని మీరు వుపయోగించ్చుకుని మీ గ్రామంలో ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన సేవలు సరైన సమయంలో పొందండి.

జై హింద్...
- సాయినాథ్ రెడ్డి.

5 comments:

  1. పంచాయితీలలో సిటిజన్స్ చార్టర్స్..

    ReplyDelete
  2. చాలా ఉపయోగకరమైన విషయాలు పోస్ట్ చేసారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాద్ రాజేష్ గారు.

      Delete