కడప పులి చదలవాడ ఉమేశ్ చంద్ర
జననం: మార్చి 19, 1966- పెదపూడి, గుంటూరు జిల్లా.
మరణం: సెప్టెంబరు 4, 1999.
చదలవాడ ఉమేశ్ చంద్ర ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. వైఎస్ఆర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు.
బాల్యము, విద్య
ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడు. తండ్రి హైదరాబాదు ఆల్విన్ సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన పిదప నిజాం కళాశాల నుండి బి.ఎ. (1987) మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందాడు. రెండింటిలోను ప్రధముడిగా నిలచి బంగారు పతకాలు సాధించాడు.
ఉద్యోగ పర్వము
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందాడు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశాడు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యాడు. 1994 అక్టోబరు లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నాడు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టాడు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించాడు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యాడు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది వైఎస్ఆర్ జిల్లాకు తిరిగి వచ్చాడు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించాడు.
నవంబరు 1998 లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందాడు.
విషాదము
ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడాడు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.
సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం.
ఉమేష్ చంద్ర గారి గురించి ఇంకా వివరాలు కొరకు: ఇక్కడ క్లిక్ చేయండి.
భారత మాత ముద్దుబిడ్డ ఉమేష్ చంద్రకి నివాళి అర్పిస్తూ...
- సాయినాథ్ రెడ్డి.
sincere officer - umesh chandra IPS
ReplyDeleteumesh chandra gurinchi mana prabutvam marchipoyindi. kanisam tv channels lo kuda chupinchatledhu. ade cinema hero la gurinchi rojantha choopistaaru..
ReplyDeleteవాళ్ళు అసెంబ్లీ లో రాజధాని గురించి కొట్టుకోవడమే సరిపోతుంది.
Deleteకడప పులి.
ReplyDeleteKadapa Tiger. Jai Umesh Chandra
ReplyDeleteyelanti man s Inka leru raru kuda
ReplyDelete