Breaking News

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు-Edupuganti Raghavendra Rao Biography

ఈడ్పుగంటి రాఘవేంద్రరావు (1890 - జూన్ 15, 1942)

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. కేంద్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. మే 15, 1935 నుండి సెప్టెంబర్ 11, 1936 వరకు రాఘవేంద్రరావు మధ్య పరగణాలు (సెంట్రల్ ప్రావిన్సెస్ - ఇప్పటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు విదర్భ ప్రాంతం) మరియు బేరర్ యొక్క ఆపద్ధర్మ గవర్నరుగా పనిచేశాడు. బ్రిటీషు పాలనలో ఒక ప్రాంతము యొక్క ప్రొవిన్సియల్ గవర్నరుగా నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు రాఘవేంద్రరావు. ఈయన ఆ తరువాత మౌంట్‌బాటన్ వైస్రాయిగా పనిచేసిన కాలములో, ఎం.ఎస్. ఆనేతో పాటు వైస్రాయి యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమితుడైనాడు. ఆనేతో పాటు రాఘవేంద్రరావు ఆ కౌన్సిల్లో భారతీయ వస్త్రధారణతోనే ఇతర బ్రిటీషు సభ్యులతో పాటు కూర్చొని తన జాతీయవాదాన్ని చాటుకున్నాడు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు తండ్రి నాగన్న వ్యవహార కారణాల వలన నాగపూరు, బిలాస్‌పూరులకు వెళ్ళడంతో రాఘవేంద్రరావు మధ్యప్రదేశంలోనే పెరిగి పెద్దయ్యాడు. ఆయన చదువు నాగపూర్‌, అలహాబాదుల్లో సాగింది. ఉన్నత విద్య కోసం ఆయన 1909లో ఇంగ్లండు వెళ్లాడు. భారతదేశం తిరిగివచ్చి బారిష్టరుగా జీవితము ప్రారంభించిన రాఘవేంద్రరావు తొలుత బిలాస్‌పూర్ చైర్మనుగా ఎన్నికైనాడు. 1926 వరకు స్వరాజ్య పార్టీలో పనిచేసిన రాఘవేంద్రరావు పార్టీలోని మరాఠీ నాయకులతో విభేదించి బయటికి వచ్చాడు.. ఆ తరువాత నాగపూరులో ప్రధానమంత్రిగానూ, గవర్నరుగానూ పనిచేశాడు. విద్యార్థిదశలోనే రాఘవేంద్రరావు జాతీయోద్యమంలోని తీవ్రవాదుల పట్ల ఆకర్షితుడయ్యాడు. వీరిలో ముఖ్యంగా వినాయక దామోదర సావర్కార్‌, శ్యాంజీ కృష్ణవర్మ వంటి వారి ప్రభావం ఆయనపై బాగా పడింది.

రాఘవేంద్రరావు 1941 జూలైలో బ్రిటీషు ప్రభుత్వపు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పౌరరక్షణ వ్యవహారాల సభ్యునిగా నియమితుడయ్యాడు. చివరి దాకా పాలనావ్యవహారాలలో తలమునకలై, అధివృక్క గ్రంథి ఆగిపోవటం వలన ఆరోగ్యం క్షీణించి 1942 జూన్ నెలలో పరమపదించాడు.

రాఘవేంద్రరావు యొక్క పెద్దకొడుకు ఆశోక్‌రావు 1983లో బిలాస్‌పూర్ మేయరుగాను, 1990 మరియు 1993లలో బిలాస్‌పూర్ నియోజకవర్గము నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.
Source: Wikipedia

2 comments:

  1. ఈడ్పుగంటి రాఘవేంద్రరావు-Edupuganti Raghavendra Rao Biography

    ReplyDelete
  2. Hey raghvendra rao gari father Peru nagayya kadu balakotayya

    ReplyDelete